Paytm IPO: ”పేటీఎం పతనానికి ఉదయ్ కొటక్ పరిహారం చెల్లించాలి”

స్టాక్ మార్కెట్లో పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన ఆరంభంలోనే భారీ పతనం చవిచూసింది. దీనిపై ఓ నెటిజన్ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్...

Paytm IPO: ”పేటీఎం పతనానికి ఉదయ్ కొటక్ పరిహారం చెల్లించాలి”

Uday Kotak

Updated On : November 23, 2021 / 9:37 PM IST

Paytm IPO: స్టాక్ మార్కెట్లో పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన ఆరంభంలోనే భారీ పతనం చవిచూసింది. దీనిపై ఓ నెటిజన్ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్ ను బ్లేమ్ చేస్తూ చేసిన ట్వీట్ కు అదే రేంజ్ లో రిప్లై ఇచ్చారు. పేటీఎం షేర్‌ ధరను తప్పుడుగా ఇష్యూ చేసినందుకు మీరే బాధ్యత వహించాలంటూ హర్షద్‌ షా అనే నెటిజన్‌ ఉదయ్‌ కోటక్‌ను ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు.

సుమారు రూ. 38 వేల కోట్లకు పైగా నష్టపోయినా ఇన్వెస్టర్లకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఉదయ్ సవివరంగా కౌంటర్ ఇచ్చారు.

‘దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. పేటీఎం ఇష్యూ ధరను కోటక్‌ నిర్థారించలేదు. ఇటీవలి కాలంలో ఐపీవోకు వచ్చిన జోమాటో, నైకా కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లీడ్ మేనేజర్‌గా ఉంది. జొమాటో షేర్‌ ఇష్యూ ధర రూ. 76గా నిర్ణయించగా ఇప్పుడు రూ. 150 వరకూ చేరిందని, నైకా షేర్‌ ఇష్యూ ధరను రూ.1125ను నిర్ణయించగా అది రూ.2100 చేరిందని’ గుర్తు చేశారు ఉదయ్‌ కోటక్‌.

……………………………………….. : ఏపీకి 3వేల 847 కోట్లు, రూ.1,998 కోట్లు.. నిధులు విడుదల

పేటీఎం షేర్ ధర ఇలా:
పేటీఎం ఐపీవో ధర రూ. 2వేల 150 ప్రారంభం అవగా….సుమారు పేటీఎం షేర్లు సుమారు 27 శాతం అంటే రూ. 585కు పడిపోయి చివరికి షేర్‌ విలువ రూ.1564కు చేరింది. ఇన్వెస్టర్లు సుమారు రూ. 38వేల కోట్ల మేర నష్టపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం రోజున మరోసారి కంపెనీ షేర్లు మరోసారి 10.35 శాతం మేర క్షీణించి రూ. 1402కు చేరుకుంది.