Udhayanidhi on Sanatan Dharma: సనాతన ధర్మంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ సందర్భంలో స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినవారికి గట్టి సమాధానం ఇవ్వాలంటూ సూచించారు. కానీ ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదంటూ స్పష్టం చేశారు.

Udhayanidhi on Sanatan Dharma: సనాతన ధర్మంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

Updated On : November 6, 2023 / 7:58 PM IST

Udhayanidhi on Sanatan Dharma: సనాతన ధర్మంపై కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బీజేపీ లాంటి రైట్ వింగ్ పార్టీలు సంస్థలే కాకుండా డీఎంకేతో మితృత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కూడా స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టాయి. అయినప్పటికీ ఆయన ఎంతమాత్రం తగ్గలేదు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని రద్దు చేయాలంటూ మరింత హీట్ పెంచారు.

కొద్ది రోజుల చర్చ అనంతరం.. ఇది కాస్త చల్లబడింది. ఇప్పుడు తాజాగా ఈ కాంట్రవర్సీని మరోసారి చర్చలోకి తెచ్చారు ఉదయనిధి. తాను సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని సోమవారం అన్నారు. ‘‘నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతి మాట సత్యం. దీన్ని నేను చట్టపరంగా కూడా ఎదుర్కొంటాను. నా వ్యాఖ్యల్లో ఒక మాటను కూడా మార్చే ప్రసక్తే లేదు. నేను నా భావజాలాన్ని చెప్పాను. అంబేద్కర్, పెరియార్, తిరుమావలన్ చెప్పిన దాని కంటే నేనేమీ ఎక్కువ చెప్పలేదు. ఈరోజు నేను ఎమ్మెల్యే, మంత్రిని కావొచ్చు. రేపు కాకపోవచ్చు. కానీ మనిషిగా ఉండడం చాలా అవసరం’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: పోలింగ్‭కు ముందు ఉన్మాదానికి దిగిన నక్సలైట్లు.. IED పేలడంతో ఒక జవాను, ఇద్దరు పోలింగ్ సిబ్బంది మృతి

సనాతన ధర్మాన్ని (Sanatan Dharma)నిర్మూలించాలి అంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించటమే కాకుండా తీవ్ర వివాదానికి దారి తీశాయి. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఉదయనిధిపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అంతేకాదు ఉదయ నిథి తల తెచ్చిస్తే రూ.10కోట్లు నజరానా ఇస్తానంటూ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఇలా ఉదయనిధిపై ఘాటు విమర్శలు, హెచ్చరికలు పెద్ద ఎత్తున వచ్చాయి.

దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ సందర్భంలో స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినవారికి గట్టి సమాధానం ఇవ్వాలంటూ సూచించారు. కానీ ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదంటూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసిన ఉదయనిధి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కాంట్రవర్సీలోకి లాగారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించలేదని.. ఆమె వితంతువు, గిరిజనురాలైనందున కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: 2023 ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే