Assembly Elections 2023: 2023 ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే

అయితే సరిగ్గా పోలింగ్ సమయానికే మహదేవ్ బెట్టింగ్ యాప్ లో ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు ముడుపులు ముట్టాయని ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది

Assembly Elections 2023: 2023 ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే

Chhattisgarh Polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జోరు దేశ నలుమూలల కనిపిస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ ఎన్నికలు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ రేపే ప్రారంభం కానుంది. ఛత్తీస్‭గఢ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోటింగ్ మంగళవారం (నవంబర్ 7)న జరగనుంది. రాష్ట్రంలోని 90 స్థానాలకు గాను మంగళవారం 20 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ పోలింగులో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో సహా బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.

ఇక ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 198 మంది పురుషులు కాగా 25 మంది మహిళలు ఉన్నారు. సీనియర్ నేతల్లో భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ సహా ఆయన మంత్రివర్గంలో ఉన్న ఐదుగురు మంత్రులు ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి ముగ్గురు మంత్రులు ఒక ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్, సిట్టింగ్ ఎమ్మెల్యేల భవితవ్యం రేపటితో ప్రజలు నిర్ణయించబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఒపీనియర్ పోల్స్ ప్రకారం.. ఛత్తీస్‭గఢ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే సరిగ్గా పోలింగ్ సమయానికే మహదేవ్ బెట్టింగ్ యాప్ లో ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు ముడుపులు ముట్టాయని ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది. ఇక నవంబర్ 17న రెండవ దశలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు (70 స్థానాలు) పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.