Higher Education Reform
Higher Education Reform: విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కమిషన్ ఆమోదం తెలిపగా.. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. మార్పులు చేసిన ఈ రీఫార్మ్స్ ప్రకారం ఇకపై దేశంలోని ఏ విద్యా సంస్థల్లో అయినా విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. మారిన విద్యావిధానం ప్రకారం రెండూ ఒకేసారి రెగ్యులర్ కోర్సులుగా కూడా అనుమతి ఇవ్వనున్నారు.
New Education rules: కొత్త విద్యా చట్టం.. పిల్లలు తప్పులు చేస్తే పెద్దలకు కఠిన శిక్షలు
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రెండు కోర్సులను.. రెండూ రెగ్యులర్ గా కానీ.. ఒకటి రెగ్యులర్, మరొకటి ఓపెన్ లేదా దూరవిద్య విధానంలో కానీ, లేదా రెండూ ఓపెన్, దూరవిద్య విధానంలో కానీ కొనసాగించవచ్చు. నూతన విద్యా విధానంలో భాగంగా ఆర్ట్స్, సైన్స్ అనే బేధం కానీ.. కరిక్యులర్, ఎక్స్టా కరిక్యులర్ తేడా కానీ ఉండదు. విద్యార్థులు తమకు నచ్చిన నైపుణ్యాలను స్వేచ్ఛగా నేర్చుకోవచ్చు. ఇక, ఈ విధానంలో కోర్సు ముగిసిన తరువాత డ్యుయల్ డిగ్రీ లభించదు. రెండు వేర్వేరు డిగ్రీలు లభిస్తాయి. ఈ కొత్త విధానానికి అనుగుణంగా యూనివర్సిటీలు నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉండగా.. విద్యార్థుల అడ్మిషన్ పాలసీ, అలాగే అటెండెన్స్ పాలసీలకు సంబంధించి కూడా ఆయా వర్సిటీలే నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంది.
Higher Education : ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య సాధ్యమేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
ఏక కాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకురాగా.. అప్పుడే ఇలాంటి ఒక అవకాశాన్ని యూజీసీ విద్యార్థులకు కల్పించింది. కానీ, అప్పడు ఆ రెండు కోర్సుల్లో ఒకటి రెగ్యులర్ విధానంలో, మరొకటి దూరవిద్య, లేదా ఓపెన్ విధానంలో చదవాల్సి ఉండగా.. ఇప్పుడు నూతన విద్యా విధానంలో భాగంగా రూపొందించిన తాజా ప్రతిపాదనలో.. రెండు కోర్సులను కూడా రెగ్యులర్ విధానంలో చదవవచ్చు. కానీ, ఆయా కోర్సులకు సంబంధించిన క్లాసులు ఒకే సమయంలో లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.