New Education rules: కొత్త విద్యా చ‌ట్టం.. పిల్లలు తప్పులు చేస్తే పెద్దలకు క‌ఠిన శిక్షలు

చైనా కొత్త విద్యా చ‌ట్టాన్ని ఆమోదించింది. విద్యార్థుల‌పై హోమ్‌వ‌ర్క్ ఒత్తిడి లేకుండా ఉండే రీతిలో చ‌ట్టాన్ని తెచ్చారు.

New Education rules: కొత్త విద్యా చ‌ట్టం.. పిల్లలు తప్పులు చేస్తే పెద్దలకు క‌ఠిన శిక్షలు

China

New Education rules: చైనా కొత్త విద్యా చ‌ట్టాన్ని ఆమోదించింది. విద్యార్థుల‌పై హోమ్‌వ‌ర్క్ ఒత్తిడి లేకుండా ఉండే రీతిలో చ‌ట్టాన్ని తెచ్చారు. స్కూల్ ముగిసిన త‌ర్వాత ప్రైవేటు ట్యూష‌న్లకు వెళ్లకుండా ఉండేందుకు కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస‌ల‌వుతున్న విద్యార్థుల‌ను కూడా దారిలో పెట్టేందుకు క‌ఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

అదేవిధంగా చెడుగా ప్రవర్తించే, నేరాల‌కు పాల్పడే పిల్లల త‌ల్లితండ్రుల‌కు క‌ఠిన శిక్షలు వేసేందుకు చట్టం చేయాలని ఆలోచిస్తుంది డ్రాగన్ ప్రభుత్వం. పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న చ‌దువుల‌ను అదుపులోకి తెచ్చేందుకు ఆయా స్థానిక ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాల‌ని పార్లమెంట్‌ సూచించింది.

విద్యార్థుల‌కు కావాల్సినంత రెస్ట్ ఇవ్వాల‌ని, వ్యాయామానికి, క్రీడలకు అవకాశం ఉండేలా వారి రోజువారి విధానాలను ప్లాన్ చేయాల‌ని ఆదేశించింది. విద్యార్థుల్లో ఒత్తిడి త‌గ్గించే మెళ‌కువ‌లు నేర్పాల‌ని, ఆన్‌లైన్ గేమ్స్‌పై మోజు త‌గ్గే విధంగా చూడాలని చట్టంలో పేర్కోన్నారు.

వీడియో గేమ్స్ ఆడే మైన‌ర్లు విషయంలో ఇటీవ‌ల విద్యాశాఖ మంత్రి కొత్త ఆదేశాలు జారీ చేసింది. శుక్ర, శ‌ని, ఆదివారాల్లో కేవ‌లం గంట మాత్రమే ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవిధంగా చూడాల‌ని అందులో స్పష్టంచేసింది. అంతకుముందు ముగ్గురు పిల్లల పాలసీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.