×
Ad

UGC New Guidelines : విద్యార్థుల ఫిర్యాదు పరిష్కార కమిటీల నియామకాలు.. యూజీసీ కొత్త మార్గదర్శకాలు

జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఏప్రిల్11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని యూజీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Published On : April 16, 2023 / 11:33 AM IST

UGC New Guidelines

UGC New Guidelines : విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీల నియామకాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు ఒక మహిళకు ఈ కమిటీలలో చైర్ పర్సన్ గా గానీ, సభ్యురాలుగా గానీ కచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలని సూచించింది.

Fake Universities List: ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసిన యూజీసీ.. జాబితాలో ఏపీ యూనివర్సిటీ

జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఏప్రిల్11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని యూజీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీలో చైర్ పర్సన్ గా గానీ, సభ్యురాలిగా గానీ ఉండాలి. కనీసం ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి చైర్మన్ గా గానీ, సభ్యులుగా గానీ ఉండాలి.