UGC Scholarship : విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్ షిప్.. ఇల్లా అప్లయ్ చేసుకోవాలి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ రిజిస్ట్రేషన్లకు ప్రాసెస్ ఓపెన్ చేసింది. అలాగే స్కాలర్ షిప్స్ ప్రకటించింది. వివిధ వర్సిటీల్లో

UGC Scholarship : విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్ షిప్.. ఇల్లా అప్లయ్ చేసుకోవాలి

Ugc Scholarship

Updated On : August 23, 2021 / 4:45 PM IST

UGC Scholarship : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ రిజిస్ట్రేషన్లకు ప్రాసెస్ ఓపెన్ చేసింది. అలాగే స్కాలర్ షిప్స్ ప్రకటించింది. వివిధ వర్సిటీల్లో పీజీ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 1000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ లభిస్తాయి.

టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్-ME, మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ-MTech కోర్సులు చదివే వారికి నెలకు రూ.7,800, ఇతర పీజీ కోర్సులు చదివే వారికి నెలకు రూ.4,500 స్కాలర్‌షిప్ లభిస్తుంది. రెండేళ్లు, మూడేళ్ల పీజీ కోర్సు చదివే వారు అర్హులు. scholarships.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. 2021 నవంబర్ 30 చివరి తేదీ. ఇన్ స్టిట్యూట్ వెరిఫికేషన్ డిసెంబర్ 15తో క్లోజ్ అవుతుంది.

కోర్సులో చేరిన నాటి నుంచి ఈ స్కాలర్‌షిప్స్ వర్తిస్తాయి. అయితే ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసేముందు విద్యార్థులు కొన్ని నియమ నిబంధనల్ని గుర్తుంచుకోవాలి.

* ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లాంటి కోర్సుల్ని నాన్ ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణిస్తారు. * కాబట్టి ఈ కోర్సులు చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందేందుకు అనర్హులు.
* ఇక కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివేవారికి కూడా ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ వర్తించదు. * రెండేళ్లు లేదా మూడేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు.
* ఎంపికైన విద్యార్థుల అకౌంట్‌లోకి నేరుగా స్కాలర్‌షిప్ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది యూజీసీ.
* విద్యార్థులు తర్వాతి తరగతికి ప్రమోట్ కాకపోతే స్కాలర్‌షిప్ ఆగిపోతుంది.
* ఆసక్తిగల విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి.
* స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 30 చివరి తేదీ.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ను విద్యార్థి చదువుతున్న ఇన్‌స్టిట్యూట్ వెరిఫై చేయడం తప్పనిసరి.
* వెరిఫికేషన్ విండో 2021 డిసెంబర్ 15 వరకు తెరిచే ఉంటుంది.

ఇలా అప్లయ్ చేసుకోవాలి…
* https://scholarships.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలో UGC / AICTE Schemes సెలెక్ట్ చేయాలి.
* అందులో PG SCHOLARSHIP SCHEME FOR SC ST STUDENTS FOR PERSUING PROFESSIONAL COURSES లింక్ క్లిక్ చేయాలి.
* వివరాలన్నీ చదివిన తర్వాత ఇదే వెబ్‌సైట్‌లో New Registration పైన క్లిక్ చేయాలి.
* పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
* ఆ తర్వాత స్కాలర్‌షిప్ స్కీమ్ సెలెక్ట్ చేసి అప్లయ్ చేయాలి.
* దరఖాస్తు చేసే ముందు విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, బోనఫైడ్, బ్యాంక్ పాస్‌బుక్ లాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.