ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ

దేశరాజధానిలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీలో 144 సెక్షన్‌ విధించడం, 20 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన సాగడం లేదని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని సింఘ్వీ అన్నారు.

ఢిల్లీలో మీడియా సమావేశంలో సింఘ్వీ మాట్లాడుతూ… ఢిల్లీ రాజధాని. గురువారం ఎర్రకోట చుట్టూ 144 సెక్షన్‌ విధించారు. 20 మెట్రో స్టేషన్లు మూసివేశారు. ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు. అటు కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. యూపీ, అసోంలో ఇదే తరహా దమనకాండ కొనసాగుతోందని సింఘ్వి అన్నారు. విపక్ష నాయకులు డీ రాజా, సీతారాం ఏచూరి, అజయ్‌ మాకేన్‌, సందీప్‌ దీక్షిత్‌, యాక్టివిస్ట్ లు యోగేంద్ర యాదవ్‌,ఉమర్‌ ఖలీద్‌లను  అదుపులోకి తీసుకున్నారు. ఇది బీజేపీ పాలన కాదు అప్రకటిత ఎమర్జెన్సీ అని సింఘ్వీ అన్నారు. మనుషులను పీక్కుతినేలా బీజేపీ పాలన సాగుతోందని మండిపడ్డారు.