Culvert Collapse Five Killed : ఒడిశాలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలి ఐదుగురు మృతి

సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు స్నానాలు చేసేందుకు ఆ కల్వర్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్ప కూలిపోయింది.

under construction culvert collapse

Odisha Under Construction Culvert : ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయగడ జిల్లాలోని ఉపరసజ గ్రామం సమీపంలో కల్వర్టును నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు స్నానాలు చేసేందుకు ఆ కల్వర్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్ప కూలిపోయింది. దీంతో నలుగురు పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు.

Massive Explosion In Pakistan : పాక్‍లో భారీ పేలుడు.. 60మందికి పైగా మృతి

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటికి తీశారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఐదుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.