Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?

ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నేటి బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు.

Union Budget 2022: ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నేటి బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. నిర్మలమ్మ పొద్దు తర్వాత.. కొన్ని వస్తువుల ధరలు పెరగ్గా.. మరికొన్ని చౌకగా మారిపోనున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మారిన ధరలు అందుబాటులోకి రానున్నాయి.

ఆర్థిక మంత్రి సీతారామన్ నాలుగో బడ్జెట్‌ తర్వాత ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో? ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ధరలు తగ్గిన వస్తువులు:
విదేశీ యంత్రాలు
వస్త్రాలు, తోలు వస్తువులు
వ్యవసాయ పరికరాలు
మొబైల్ ఛార్జర్లు

చెప్పులు, బూట్లు
వజ్రాల నగలు
ప్యాకేజింగ్ పెట్టెలు
రత్నాల ఆభరణాలు

కోకో బీన్స్
మిథైల్ ఆల్కహాల్
ఎసిటిక్ ఆమ్లం
కట్, పాలిష్ వజ్రాలు

మొబైల్ ఫోన్స్
కెమెరా లెన్స్
ఇంగువ, కాఫీ గింజలు

ఖరీదైన వస్తువులు:
గొడుగు
మూలధన వస్తువులు
కలపని ఇంధనం
రోల్డ్ గోల్డ్ ఆభరణాలు

లౌడ్ స్పీకర్
హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు
స్మార్ట్ మీటర్
సౌర ఘటం
సోలార్ మాడ్యూల్స్
ఎక్స్-రే మిషన్
ఎలక్ట్రానిక్ బొమ్మ భాగాలు

కస్టమ్ డ్యూటీ తగ్గింపు..
బడ్జెట్‌లో ప్రభుత్వం రత్నాలు, ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. కస్టమ్ డ్యూటీని 5 శాతం తగ్గించి, కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కూడా కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం 5శాతం తగ్గించింది. దీంతో వాటి ధరలు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు