Union budget 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బడ్జెట్.. ఈ ఆసక్తికర అంశాలు తెలుసా?

మధ్యంతర బడ్జెట్‌ను 2024, ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.

Budget session

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌ 2024-2025ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెడతారు.

తాత్కాలిక బడ్జెట్‌ ఏంటి?

కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సారి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సీతారామన్‌ వరుసగా ఆరోసారి పార్లమెంట్లో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు.

ఈసారి కూడా పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్‌ను చదువుతారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ ట్యాబ్‌ ద్వారానే గత ఏడాది కూడా పేపర్ లెస్‌గానే బడ్జెట్‌ను చదివి వినిపించారు. మధ్యంతర బడ్జెట్ అంటే వచ్చే ఆర్థిక సంవత్సర ప్రారంభ నెలలను కవర్ చేస్తూ ప్రవేశపెట్టే స్వల్పకాలిక బడ్జెట్.

ప్రభుత్వ ఆదాయం, వ్యయంపై దృష్టి పెట్టి దీన్ని ప్రవేశపెడతారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే వరకు అవసరమయ్యే ఖర్చుల నిర్వహణకు ఈ తాత్కాలిక బడ్జెట్ ద్వారా వీలు కలుగుతుంది.

ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. మధ్యంతర బడ్జెట్‌ను 2024, ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్‌లో ముగుస్తాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర బడ్జెట్ సమావేశాలను అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి రోజు రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. మే చివరి వారం లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది.

ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ మధ్యంతర కాలంలో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి మధ్యంతర బడ్జెట్ చాలా ముఖ్యం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ 4 నుంచి వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తును ప్రారంభించింది.

Union Budget 2024: బంగారం కొంటున్నారా? కేంద్ర బడ్జెట్‌లో ఇదే జరిగితే ధర భారీగా తగ్గొచ్చు..

ట్రెండింగ్ వార్తలు