ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

Union Budget పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు జనవరి-29,2021న ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(CCPA).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్​ 8 వరకు సభ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.

సీసీపీఏ సిఫార్సుల ప్రకారం.. ఈనెల 29న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం సార్వత్రిక పద్దును ప్రవేశపెడుతుంది. గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు మాదిరిగానే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్​ సెసన్స్​​ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది కరోనా కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దైన విషయం తెలిసిందే.

అయితే, డిసెంబర్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… రాబోయే బడ్జెట్ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ వ్యయం యొక్క వేగాన్ని కొనసాగిస్తుందని మరియు ఆర్థిక పునరుజ్జీవనం కొనసాగడానికి “చైతన్యం” కలిగి ఉంటుందని చెప్పారు. రాబోయే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుజ్జీవనం, స్థిరమైన పునరుజ్జీవనం కోసం అవసరమైన చైతన్యాన్ని కలిగి ఉంటుందని నాకు తెలుసు అని ఆమె చెప్పారు.