income tax
Income Tax : మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్షికంగా రూ.15లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారు చెల్లించే ఆదాయపు పన్ను తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పన్ను తగ్గింపు ఉశమనం 2020 పన్ను విధానం ఎంచుకున్న వారికే అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో బాలుడికి తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే?
ప్రస్తుతం కేంద్రం రెండు రకాల పన్నులను వసూళ్లు చేస్తుంది. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ విధానం.. మరొకటి న్యూ ట్యాక్స్ విధానం. పాత పన్ను విధానంలో పలు మినహాయింపులు ఇచ్చారు. కొత్త పన్ను విధానంలో రూ.3లక్షల నుంచి 15లక్షల వరకు ఆదాయం ఉంటే 5 నుంచి 20శాతం వరకు పన్ను విధిస్తున్నారు. అంతకు మించి ఆధాయం ఉన్నవారు 30శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొత్త విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.
Also Read: Fake IPS Officer : నకిలీ పోలీసు తిరుగుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారు
పన్ను తగ్గింపు విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. గత కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థికవేత్తలు సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు కూడా ట్యాక్స్ పేయర్స్ కు రిలీప్ ను ఇచ్చేలా పన్ను రేట్లు తగ్గించాలని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం భారత ఆర్థిక వృద్ధి మందగమనంలో పయనిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో వినియోగం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పన్ను శాతాన్ని తగ్గిస్తే వినియోగానికి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మరి.. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.