union govt : నేడు నదుల అనుసంధానంపై కేంద్రం కీలక సమావేశం

కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల జలవనరుల శాఖ కారదర్శులతో కీలక సమావేశం జరుగనుంది.

Rivers

rivers connectivity : నదుల అనుసంధానంపై ఇవాళ జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ వద్దంటున్నా నదుల అనుసంధానంపై కేంద్రం ముందుకే వెళుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసి, రాష్ట్రాలకు పంపించింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఐదు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం జరపనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా పాండిచ్చేరిలతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సమావేశం జరగనుంది.

కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల జలవనరుల శాఖ కారదర్శులతో కీలక సమావేశం జరుగనుంది. ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు, ఆలోచనలు కేంద్రం తీసుకోనుంది. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరీ నదుల అనుసంధానం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నీటి అవసరాలను పెద్ద ఎత్తున తీర్చేందుకు ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.

CM KCR : నదుల అనుసంధానం మిలీనియానికే బిగ్ జోక్ : సీఎం కేసీఆర్

గోదావరిలోని ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్, సోమశిల, తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్ వరకు నదులను కేంద్రం అనుసంధానించనుంది. దీంతో తెలంగాణలోని నల్గొండ, ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమిళనాడులోని తిరువళ్లూర్, వెల్లోర్, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూర్, కాంచీపురం లాంటి ప్రాంతాలకు నీటి ప్రాజెక్టులు నేరుగా అనుసంధానం కానున్నాయి.

ఇక ఉప ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని గుంటూరు, తమిళనాడులోని తంజావూర్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. నదుల అనుసంధానానికి తొలిదశలో 85 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని కేంద్ర జలశక్తి శాఖ అంచనా వేస్తోంది.

River linking: నదుల అనుసంధానం వేగవంతం.. కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం

జాతీయ జల అభివృద్ధి సంస్థ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఎజన్సీ) సుమారు 85 వేల కోట్లరూపాయల వ్యయ అంచనాతో “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” ను రూపొందించింది. వృధాగా పోతున్న 247 టి.ఎమ్.సిల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే నదుల అనుసంధానం ప్రధాన లక్ష్యం. మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఖర్చులు రాష్ట్రాలు భరించనుంది.

తెలంగాణకి సుమారు 80 టి.ఎమ్.సిలు, ఏపికి సుమారు 90 టి.ఎమ్.సిలు, పుదుచ్చేరి 5 టి.ఎమ్.సిలు, తమిళనాడు సుమారు 45 టి.ఎమ్.సిలు, కర్నాటక సుమారు 25 టి.ఎమ్.సిలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 5 ఏళ్లలో గోదావరి, కావేరి నదుల అనుసంధానం పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.