CM KCR : నదుల అనుసంధానం మిలీనియానికే బిగ్ జోక్ : సీఎం కేసీఆర్

ఎవరిని మోసం చేయడానికి ఇలా చెబుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాల కన్సెంట్ తీసుకున్నావా?.. మాతో మాట్లాడారా? అని అడిగారు.

CM KCR : నదుల అనుసంధానం మిలీనియానికే బిగ్ జోక్ : సీఎం కేసీఆర్

Kcr Comments

Telangana CM KCR : ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నదుల అనుసంధానం బిగ్ జోక్ ఆఫ్ ది మిలీనియం అన్నారు. కిఫ్ట్ కరెన్స్ నీ మీరు అనుమతి ఇస్తున్నారు… ఇది నాన్ సెన్స్ కాదా? అని ప్రశ్నించారు. ఎవరిని మీరు గందర గోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణ, కావేరి అనుసంధానం ఎలా చేస్తారు అని నిలదీశారు. గోదావరి జలాలు తెలుగు రాష్ట్రాలకు చెందినవి.. ఈ నీళ్లను కావేరిలో ఎలా కలుపుతార ప్రశ్నించారు.

ఎవరిని మోసం చేయడానికి ఇలా చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రాల కన్సెంట్ తీసుకున్నావా?.. మాతో మాట్లాడారా? అని అడిగారు. 100 కిలో మీటర్ల దూరం, 100 మీటర్ల ఎత్తుకు నీళ్లు పంపి అందరికీ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో 65 వేల టీఎంసీ నీళ్ల లభ్యత ఉందన్నారు. ఉపయోగంలో ఉన్నవి 35 వేల టీఎంసీ లు మాత్రమేనని చెప్పారు. మీది బ్యాడ్ పాలసీ, అవివేక పరిపాలన కాదా? అన్నారు.

CM KCR : గుజరాత్ మోడల్.. పైన పటారం, లోన లొటారం : సీఎం కేసీఆర్

అద్భుతమైన పరిపాలనలో పరుగులు తీసే రాష్ట్రాల కాళ్లల్లో కట్టే పెట్టకండి అన్నారు. కేంద్రం చెప్పేది అంతా బోగస్, సిగ్గులేదన్నారు. మహాభారతంలోని శ్లోకాన్ని తీసుకోవడం పట్ల మీకు సిగ్గు అనిపించలేదా? అన్నారు. దొంగ మొఖం గాళ్లు… మొఖం మీద ఉమ్మేసిన సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.