CM KCR : గుజరాత్ మోడల్.. పైన పటారం, లోన లొటారం : సీఎం కేసీఆర్

కరోనాతో కూలీలు, రైతులు అల్లాడుతుంటే బడ్జెట్ నిరాశ జనకంగా ఉందన్నారు. గ్రామీణ ఉపాధి పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు.

CM KCR : గుజరాత్ మోడల్.. పైన పటారం, లోన లొటారం : సీఎం కేసీఆర్

Kcr (2)

CM KCR Comments : కేంద్ర ప్రభుత్వం దారుణమైన విద్యుత్ విధానాన్ని అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ సంస్కరణ అంటే రైతుల్ని నుంచి బిల్లులు వసూలు చేయడమేనని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉందని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ పైన పటారం, లోన లొటారం అని విమర్శించారు. రైతులు, పేదలు, దళితులు, నిరుద్యోగులకు నిరాశజనకమైన బడ్జెట్ అన్నారు.

వ్యవసాయానికి మీటర్లు పెట్టి రైతుల నుంచి వసూలు చేయాలన్నది వీరి ఉద్దేశం అన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 0.5 శాతం ఇస్తారట అని విమర్శించారు. తెలివి తక్కువ, మెదడు లేని ప్రభుత్వం ఈ దేశంలో ఉందన్నారు. ఘోరమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. దొంగ సోషల్ మీడియా పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ వైద్యానికి నిధులు కేటాయించలేదన్నారు.

CM KCR : కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది : సీఎం కేసీఆర్

కరోనాతో కూలీలు, రైతులు అల్లాడుతుంటే బడ్జెట్ నిరాశ జనకంగా ఉందన్నారు. గ్రామీణ ఉపాధి పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులు పెట్టీ రాష్ట్రాలను వెనక్కి నెట్టిందన్నారు. గంగానదిలో శవాలు తెలినాయి… ఇది దారిద్ర్యం గొట్టు ప్రభుత్వమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేయలేదన్నారు. దిక్కుమాలిన సోషల్ మీడియా పెట్టీ, దొంగ ప్రచారం చేశారని పేర్కొన్నారు. గుజరాత్ మాడల్ పెడితే ఏదో పొడస్తరని అనుకున్నారు.. కానీ వీళ్ళు(కేంద్రం) ఏమి చేయారని తేలిపోయిందన్నారు.