CM KCR : కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది : సీఎం కేసీఆర్

ఆర్థికమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల్ని దారుణంగా వంచించారని పేర్కొన్నారు. బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు కూడా తప్పుగా చెప్పారని తెలిపారు.

CM KCR : కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది : సీఎం కేసీఆర్

Cm Kcr (2)

union budget-2022 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాలను చెప్పారు. ఆ శ్లోకం భీష్మాచార్యుడు అంపశయ్యపై ఉన్నప్పుడు చెప్పే శ్లోకం అన్నారు. ధర్మమార్గానికి సంబంధించిన శ్లోకం చెప్పి..అధర్మ మార్గమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజల్ని దారుణంగా వంచించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి దారుణమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు.

ఆర్థికమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల్ని దారుణంగా వంచించారని పేర్కొన్నారు. బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు కూడా తప్పుగా చెప్పారని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులకు కేంద్రం కేటాయించింది రూ.12 వేల కోట్లేనని చెప్పారు. ఒక్క తెలంగాణలోనే రూ.33,611 కోట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించామని గుర్తు చేశారు. ఒక రాష్ట్రం పెట్టేంత ఖర్చు కూడా కేంద్రం దళితులకు కేటాయించలేదని విమర్శించారు.

LIC Employees Unions : నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్ : ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు

రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని బడ్జెట్ లో వ్యవసాయాన్ని మర్చిపోయారని వెల్లడించారు. యూరియాపై రూ.12,708 కోట్ల సబ్సిడీ తగ్గించారని పేర్కొన్నారు. మిగిలిన ఎరువులపై రూ.22,192 సబ్సిడీ కోత విధించారని తెలిపారు. ఎరువులపై మొత్తం రూ.34 వేల కోట్ల సబ్సిడీ తగ్గించారని చెప్పారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం దారుణమైన విద్యుత్ విధానాన్ని అవలంభిస్తోందన్నారు. విద్యుత్ సంస్కరణ అంటే రైతుల్ని నుంచి బిల్లులు వసూలు చేయడమేనని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉందని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ పైన పటారం, లోన లొటారం అని విమర్శించారు. రైతులు, పేదలలు, దళితులు, నిరుద్యోగులకు నిరాశజనకమైన బడ్జెట్ అన్నారు.