ఉగ్రవాదులపై ఫోకస్ : జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్

  • Publish Date - March 2, 2019 / 06:43 AM IST

ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపడానికి రెడీ అయిపోయింది. జమాతే ఇస్లామీ సంస్థపై ఐదేళ్లపై నిషేధం విధించింది. జమాతే ఇస్లామీకి చెందిన కార్యాలయాల్లో  దాడులు చేసి రూ. 52 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు పోలీసులు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు జమాతే ఇస్లామీ ఆర్థికంగా సహకరించిందని కేంద్రం పేర్కొంటోంది.
Read Also : ఈ పరీక్షలు పాసైతేనే : అభినందన్‌ను ఏం చేస్తారు

జమ్మూ కాశ్మీర్ పోలీసులు జమాతే ఇస్లామీకి చెందిన 140మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలపై పలువురు జమాతే ఇస్లామీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం ఇండియా కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఇండియా హెచ్చరికలు చేసింది. ఎన్ఐఏ చేపట్టిన తనిఖీల్లో బయటపడిన ఆధారాలపై చర్యలు తీసుకొంటోంది.
Read Also : రైతులు కావలెను : జీతం 20 వేలు

హురియత్ కాన్ఫరెన్స్ నేతలపైనా కేంద్రం దృష్టి పెట్టింది. కాశ్మీర్‌ను ప్రత్యేక దేశం కల్పించాలని లేకుంటే స్వయం ప్రతిపత్తి కల్పించాలని కాశ్మీర్ యువకులను కొన్ని సంస్థలు రెచ్చగొడుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలని భారత్ నిర్ణయం తీసుకుంది. 
Read Also : గివేం మాటలు : జేషే‌ ఏ మహ్మద్‌తో సంప్రదింపులు – ఖురేషీ