హైదరాబాద్ పై అలాంటి ఆలోచన లేదు

హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం, నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిధ్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గత సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, తాలాక్ రద్దు బిల్లులను తీసుకువచ్చామని ఆయన తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామవి, విద్య, వైద్యం,నదులు అనుసంధానం విషయాలపై ఈసమావేశాల్లో చర్చిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు వైద్యం, విద్య వంటి మౌలిక వసతులు కల్పించటమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు.
పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదని అంటూ….కాళేశ్వరానికి జాతీయ హోదా అంశం విభజన బిల్లులో కేసీఆర్ ఎందుకు పెట్టించలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.