Nitin Gadkari: కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను: కేంద్ర మంత్రి గడ్కరీ

కాంగ్రెస్ పార్టీ.. అతిత్వరలోనే తిరిగి పుంజుకుని..పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Nitin Gadkari: ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి అనంతరం నిరాశానిస్పృహలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. అతిత్వరలోనే తిరిగి పుంజుకుని..పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లోక్‌మత్ జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో శనివారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ ముక్త్ భారత్” అనే బీజేపీ నినాదనాన్ని పక్కనబెట్టి నితిన్ గడ్కరీ చేసిన ఈవ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ లాంటి స్ట్రాంగ్ పార్టీ ప్రజాస్వామ్య దేశానికి ఎంతో అవసరమని, వరుస ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు దిగులుచెందక..ఆపార్టీ నేతలు నిరాశానిస్పృహల్లో చిక్కుకోవద్దని..తిరిగి మరింత బలంగా ఎదగాలని నితిన్ గడ్కరీ ఆకాంక్షించారు.

Also read:Punjab CM Mann: అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్న పంజాబ్ కొత్త సీఎం

తన వ్యాఖ్యలపై గడ్కరీ వివరణ ఇస్తూ..ప్రజాస్వామ్య దేశంలో అధికార ప్రతిపక్షాలు పాలక యంత్రాంగం మరియు ప్రతిపక్షం అనే రెండు చక్రాల్లాంటివని అన్నారు. ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు బలహీనపడితే..ప్రాంతీయ పార్టీలు ఆస్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయని.. ప్రజాస్వామ్య వ్యవస్థకు, పాలనా వ్యవస్థకు అది మంచిదికాదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవస్థపై ప్రాంతీయ పార్టీలు అవగాహనరాహిత్యంతో వ్యవహరిస్తుంటాయని, స్థానికంగా ప్రజలను తప్పుదోవపట్టించే ప్రమాదం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Also Read:Srilanka – India: శ్రీలంక ఆర్ధిక మంత్రిని కలిసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

ఈసంధర్భంగా జవహర్ లాల్ నెహ్రు హయాంలో అధికారప్రతిపక్షాల పాత్రను గడ్కరీ ఉదహరించారు. ఆసమయంలో లోక్ సభ స్థానానికి అటల్ బిహారి వాజ్పాయ్ పోటీచేసి ఓడిపోయారని..రెండే రెండు సీట్లతో బీజేపీ పార్లమెంట్ లోకి అడుగుపెట్టిందని గడ్కరీ గుర్తుచేశారు. అయినప్పటికీ జవహర్ లాల్ నెహ్రూ..వాజ్పాయ్ ని ఎంతో గౌరవించారని గడ్కరీ వివరించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ వెన్నంటే ఉండి..పార్టీ బలోపేతానికి కృషిచేయాలని..జయాపజయాలు దైవాధీనమని గడ్కరీ అన్నారు.

Also Read;Gujarat : కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రక్షాళన.. టీంలోకి కొత్తగా 200 మంది

ట్రెండింగ్ వార్తలు