Srilanka – India: శ్రీలంక ఆర్ధిక మంత్రిని కలిసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

శ్రీలంకకు భారత్ సహాయం మరియు ఇతర దౌత్యపరమైన అంశాలపై ఇరువురు చర్చించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు

Srilanka – India: శ్రీలంక ఆర్ధిక మంత్రిని కలిసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

Jaishankar

Srilanka – India: భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ సోమవారం శ్రీలంక ఆర్ధిక మంత్రి బాసిల్ రాజపక్సతో భేటీ అయ్యారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన జైశంకర్ మార్గమధ్యలో కొలంబో చేరుకున్నారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సహాయం మరియు ఇతర దౌత్యపరమైన అంశాలపై ఇరువురు చర్చించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. అయితే జైశంకర్ పర్యటన శ్రీలంక సంక్షోభం గురించి కాదని..శ్రీలంకతో ద్వైపాక్షిక చర్చలు మరియు ఏడు దేశాల BIMSTEC శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Also read:Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను గట్టెక్కించేందుకు అంతకుముందే భారత్ $1 బిలియన్ డాలర్ల లైన్ అఫ్ క్రెడిట్ ప్రకటించింది. ఈక్రమంలో జైశంకర్ ఆదేశ ఆర్థికమంత్రితో సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయినప్పటికీ మార్చి 30న జరగనున్న BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో భారత్ తరుపున హాజరయ్యేందుకు జైశంకర్ కొలొంబోలో పర్యటిస్తున్నారు. భారత్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్ మరియు భూటాన్ దేశాల భాగస్వామ్యంతో.. బంగాళాఖాతం తీరప్రాంత దేశాల మధ్య బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కోసం ఈ BIMESTEC కూటమిని ఏర్పాటు చేశారు.

Also read:Goa : ప్రమోద్ సావంత్ అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

ప్రస్తుత శిఖరాగ్ర సమావేశానికి శ్రీలంక ఆదిత్యమిస్తుండగా.. మార్చి 30న జరిగే సమావేశంలో భారత ప్రధాని మోదీ సహా ఇతర సభ్యదేశాల నేతలు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బంగాళాఖాతం తీరప్రాంత దేశాల అభివృద్ధిపై ఆయా దేశాధినేతలు చర్చించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కరువు తాండవిస్తుంది. దేశంలో కనీస అవసరాలు కూడా పొందలేని ప్రజలు రాజపక్స ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. త్రాగునీరు, విద్యుత్, గ్యాస్ వంటి కనీస అవసరాలు కూడా పొందలేని స్థితిలో శ్రీలంక ప్రజలు అల్లాడిపోతున్నారు.

Also Read:West Bengal : అసెంబ్లీలో డిష్యూం.. డిష్యూం, బీజేపీ సభ్యుడికి తీవ్రగాయాలు!