Goa : ప్రమోద్ సావంత్ అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 40 సీట్లలో మెజార్టీ మార్కుకు ఒక్క స్థానం తక్కువగా 20 సీట్లను...

Goa : ప్రమోద్ సావంత్ అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

Goa Cm

Pramod Sawant For Taking Oath : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడం రెండోసారి. గోవా గవర్నర్ P S Sreedharan Pillai ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read More : Goa Chief Minister: గోవా సీఎంగా కొనసాగనున్న ప్రమోద్ సావంత్

ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, కేబినెట్ మంత్రులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నట్లు, గోవా ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కంటే ముందు… సావంత్ ప్రార్థనలు చేశారు. డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం జరిగింది.

Read More : Goa BJP : గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 40 సీట్లలో మెజార్టీ మార్కుకు ఒక్క స్థానం తక్కువగా 20 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో M.G.P, స్వతంత్ర్య ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే గోవాకు రెండుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 7వ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డ్ సృష్టించనున్నారు. అంతకుముందు 2019లో ఆయన మొదటి సారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.