Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా..

Padma Awards
Padma Awards: రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా మార్చి 28న జరిగే రెండో విడత కార్యక్రమంలో 74మందికి పురస్కారాలు అందజేస్తారు. ఢిల్లీ వేదికగా జరగనున్న కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డుల ప్రదానం జరగనుంది. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణానంతరం అతని కుటుంబీకులకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు.
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం , విద్య, క్రీడలు,పౌర సేవల విభాగాలలో కృషి చేసిన వారికి ఏటా పద్మ అవార్డులతో కేంద్రం సత్కారాలు అందజేస్తుంది. ఈ క్రమంలోనే 2022 సంవత్సరానికి నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
Read Also: దేశోన్నత పురస్కారాలు అందుకున్న క్రీడాకారులు
పద్మా అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉండగా 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలతో పాటు విదేశీయులు, ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.