Pratap Sarangi
Pratap Sarangi కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగికి ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నాం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతంలోని పోడాసుల చాక్ దగ్గర ఆయన కారును ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. కిడ్నీ రోగికి సహాయం చేయడానికి కేంద్ర మంత్రి సమీపంలోని గ్రామానికి వెళుతుండగా ఒక ట్రాక్టర్ అకస్మాత్తుగా ఆయన కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మంత్రితోపాటు ఆయన పీఏ, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వీరిని ట్రీట్మెంట్ కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కేంద్రమంత్రి మోకాలికి మరియు ఎడమ కంటికి గాయమైంది. నీలగిరి సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, సారంగిని బాలసోర్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు