రైతు లీడర్లతో చర్చలు ప్రారంభించిన కేంద్ర మంత్రులు

Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది రైతు సంఘాల ప్రతినిధులతో మూడవ రౌండ్ చర్చలు ప్రారంభించింది.



కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్,పియూష్ గోయల్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో పంజాబ్ కి చెందిన రైతులు, హర్యానా నుంచి ఇద్దరు రైతు సంఘాల ప్రతినిధులు,ఏఐకేఎస్ సీసీ లీడర్ యోగేంద్ర యాదవ్,ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో నాయకుడు పాల్గొన్నారు.



కాగా,రైతులు ఆందోళనలను విరమింపచేసేలా తగిన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు ఇవాళ ఉదయం టాప్ బీజేపీ లీడర్లు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువరు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావైశమై చర్చించిన విషయం తెలిసిందే.



అయితే, రైతుల ఆందోళనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉపసంహరించుకునే ప్రశక్తే లేదని,దీనిపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం సృష్టంగా చెబుతోంది. ఈ చట్టాలపై రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకే రైతులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం చెబుతోంది.