ప్రధాని చెప్పిన లోకల్ లాక్‌డౌన్స్, మైక్రో-కంటైన్మెంట్ జోన్స్ అంటే ఏంటి?

ప్రధాని చెప్పిన లోకల్ లాక్‌డౌన్స్, మైక్రో-కంటైన్మెంట్ జోన్స్ అంటే ఏంటి?

cOVID THIRD WAVE

Updated On : September 24, 2020 / 3:50 PM IST

Unlock 4 micro-containment zones: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. లోకల్ లాక్‌డౌన్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తే కొవిడ్-19 కేసులు ఎందుకు అంత తీవ్రంగా పెరిగాయని ప్రశ్నించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు మీటింగ్ కు అటెండ్ అయ్యారు.

ఈ ఏడు రాష్ట్రాల్లోని 60జిల్లాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ప్రధాని అన్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయానని అన్నారు.

లోకల్ లాక్‌డౌన్స్ అంటే ఏమిటి?
ప్రస్తుతం ఇండియాలో నాలుగో ఫేజ్ లాక్‌డౌన్ అమలులో ఉంది. లోకల్ లాక్ డౌన్లు ఇంకా చాలా ప్రదేశాలలో జరుగుతూనే ఉన్నాయి. లోకల్ లాక్‌డౌన్లు అంటే ఒకటి లేదా రెండు రోజుల పాటు అత్యవసరాలు మినహాయించి అన్నీ ఎకానమిక్ యాక్టివిటీలు క్లోజ్ చేయడం. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో ఆగష్టు నెల అన్‌లాక్3 అమలులో ఉన్న సమయంలో లోకల్ లాక్‌డౌన్స్ నిర్వహించారు.

సెప్టెంబరు నెలలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్స్ ను ఎత్తేసి ఎకనామిక్ యాక్టివిటీస్ మొదలుపెట్టేశాయి.

మైక్రో-కంటైన్మెంట్ జోన్లు అంటే ఏమిటి?
మైక్రో కంటైన్మెంట్ జోన్లు అంటే కొవిడ్-19 కేసులు నమోదై ఉన్న నిర్ధిష్ట ప్రదేశాల్లో అమలు చేస్తారు. వాటిని గుర్తించింది. ఆ బిల్డింగులను లేదా.. ఒక వీధిని మొత్తం ఐసోలేషన్ లో ఉంచడమే. పెద్ద ఏరియాను బ్లాక్ చేసి ఎకనామిక్ యాక్టివిటీలను బ్లాక్ చేయకుండా ఇలా నిర్వహిస్తున్నారు.

అన్‌లాక్ 4 గైడ్ లైన్ ఆధారంగా.. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ చెప్తుందేంటంటే కేంద్రం అనుమతి లేకుండా లోకల్ గా ఎటువంటి నిబంధనలు విధించడానికి వీల్లేదు.