చివరి శ్వాస వరకు : ముక్కులో పైప్‌తోనే బడ్జెట్ పెట్టిన సీఎం
గోవా: కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు.

గోవా: కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు.
గోవా: కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లకి వచ్చారు. ముక్కులో పైపుతోనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ఆయన ముఖంలో చాలా మార్పు కనిపించింది. బాగా బలహీనంగా ఉన్నారు. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూనే బడ్జెట్ చదివారు. ఈయన మనోహర్ పారికరేనా అనే సందేహం కలిగేలా ఆయన రూపం ఉంది.
పారికర్ గోవా ఆర్థికశాఖ మంత్రి కూడా. దీంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పారికర్ నెత్తిపై డిఫెన్స్‌కు చెందిన క్యాప్ కూడా ఉంది. ఇద్దరు సహాయకులు ఆయన పక్కనే ఉన్నారు. వారి సపోర్టుతోనే ఆయన అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాసేపు ఆగి నీళ్లు తాగి మళ్లీ బడ్జెట్ పేపర్లు చదివారు.
63 ఏళ్ల పారికర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2018 డిసెంబర్ నుంచి ఆయన కనిపించలేదు. ఆయనకు పలు సర్జరీలు జరిగాయి. ఆ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా బెడ్‌కే పరిమితం అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడంతో అతికష్టం మీద ఆయన అసెంబ్లీకి వచ్చారు. పారికర్ వెంట డాక్టర్ల బృందం కూడా ఉంది.