రేపిస్ట్‌నే పెళ్లి చేసుకున్న 10ఏళ్ల బాలిక.. ట్రిపుల్ తలాఖ్‌తో విడాకులు

రేపిస్ట్‌నే పెళ్లి చేసుకున్న 10ఏళ్ల బాలిక.. ట్రిపుల్ తలాఖ్‌తో విడాకులు

Updated On : August 24, 2020 / 6:42 AM IST

పదేళ్ల బాలికపై రేప్ చేసిన దుర్మార్గుడిని శిక్షించకుండా అదే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపారు. ఆ దుర్మార్గుడు మరోసారి శాడిజాన్ని చూపిస్తూ ట్రిపుల్ తలాఖ్ ఇచ్చి విడాకులిచ్చేశాడు. బుద్ధనా పోలీస్ స్టేషన్ గ్రామానికి చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ కౌన్సిలింగ్ కోసం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.



ఫిబ్రవరి 16న రేప్ అయిన పూనమ్ శర్మ అనే బాలికను సోదరి బావ రేప్ చేశాడు. ఈ ఘటనను చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ పోలీసులకు సమాచారం అందించింది. నిందితుడు షామ్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ వాళ్లు ఆగష్టు 4న పేరెంట్స్ దగ్గర విడిచిపెట్టారు.



బుద్ధనా ఎస్హెచ్వో కేపీ సింగ్ ఘటనపై ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. బాధితులను పలు ప్రశ్నలు వేసి విచారిస్తున్నారు. సోదరి బలవంతం మీదనే బాలిక పెళ్లి చేసినట్లుగా తెలుస్తుంది.