Oxygen cylinder for One rupee : ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్..కరోనా బాధితులకు ప్రాణదాతగా మారిన వ్యాపారవేత్త
ఓ వ్యాపారవేత్త ఒకే ఒక్క రూపాయికి ఆక్సిజన్ సిలిండర్ ఇస్తూ తన పెద్ద మనస్సును చాటుకుంటున్నాడు యూపీకి చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా. ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ నింపుతూ దయాగుణాన్ని చాటుకుంటున్నారు. తన ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను కేవలం ఒక్క రూపాయికే నింపుతూ పెద్ద మనస్సును చాటుకుంటున్నారు యూపీకి చెందిన మనోజ్ గుప్తా అనే వ్యాపారవేత్త.

Refills Oxygen Cylinders At Rs.1
refills oxygen cylinders at Rs.1 : ఈ కరోనా కాలంలో ఓవైపు ఎప్పుడూ చూడని వినని దారుణాలు జరుగుతున్నాయి. మరో వైపు మానవత్వం కనిపిస్తోంది. కరోనా వచ్చిదంటే చాలు ఆక్సిజన్ అవసరం వస్తోంది. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు కొరతతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అవసరానికి తగిన ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న దారుణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో ఎంతోమంది దాతలకు ఆక్సిజన్ కోసం విరాళాలు ఇస్తున్నారు. కానీ ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. బ్లాక్ మార్కెట్లో రూ .30,000 కు అమ్ముతున్న పరిస్థితి ఉంది.
ఈక్రమంలో ఓ వ్యాపారవేత్త ఒకే ఒక్క రూపాయికి ఆక్సిజన్ సిలిండర్ ఇస్తూ తన పెద్ద మనస్సును చాటుకుంటున్నాడు. ఒకప్పుడు ఆక్సిజన్ అందక బాదపడిన ఆ వ్యాపారవేత్త తనలా ఎవ్వరూ బాధపడకూడదని ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ నింపుతూ దయాగుణాన్ని చాటుకుంటున్నానరు. తన ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను కేవలం ఒక్క రూపాయికే నింపుతూ పెద్ద మనస్సును చాటుకుంటున్నారు యూపీకి చెందిన మనోజ్ గుప్తా అనే వ్యాపారవేత్త.
ఉత్తరప్రదేశ్‌లోని హమీన్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా. రిమ్‌జిమ్ ఇస్పాత్ పరిశ్రమకు యజమాని. గత సంవత్సరం ఏడాది ఆయన కూడా కరోనా బారిన పడ్డాడు. ఈనాటి పరిస్థితే అప్పుడు కూడా ఉంది. ఆ సమయంలో మనోజ్ గుప్తా కరోనా సోకి ఆక్సిజన్ అందక శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ దొరక్కపోతే ఎంత బాధ ఉంటుందో స్వతహాగా అనుభవించిన గుప్తా దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ కొరతను చూసి చలించిపోయారు. ఆక్సిజన్ అందక తాను పడ్డ అవస్థను గుర్తు చేసుకున్న గుప్తా తనవంతుగా ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే తన స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉత్పత్తి చేస్తున్నా ఆక్సిజన్‌ను కరోనా రోగులకు అందించాలని అనుకున్నాడు.
తన ప్లాంట్‌లో రోజుకు 1000 సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే సామర్థ్యం ఉండగా.. ఒక్కో సిలిండర్‌ను కేవలం ఒక్క రూపాయికే నింపి అందిస్తున్నారు. నిజానికి ఉచితంగానే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేయాలని అనుకున్నా..తమ ఉత్పత్తులకు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండటంతో కనీస చార్జీ కింద ఒక్క రూపాయి తీసుకుంటున్నానని తెలిపారు. కరోనా రోగుల బంధువులు వచ్చి తమ ఆధార్ కార్డు, రోగి ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ నింపి ఒక్క రూపాయికే ఇస్తున్నానని తెలిపారు.
తన బాట్లింగ్ ప్లాంట్లలో గుప్తా ఇప్పటివరకూ వేయికి పైగా ఆక్సిజన్ సిలిండర్ల ను నింపి వేలాది మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడారు. ఒక్క రూపాయికే సిలిండర్ నింపుతున్నట్లు తెలిసి లఖ్‌నవూ, ఝాన్సీ, బందా, అలీగఢ్, లలిత్‌పూర్, కాన్పూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్లాంట్‌కు వస్తున్నారని తెలిపారు.
కాగా..కరోనా కేసులు గంటగంటకూ పెరుగిపోతున్న సమయంలో పెషేంట్లకు సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం పరిస్థితి దారుణంగా తయారైంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్‌లో ఆక్సిజన్ సిలిండర్లను రూ. 30 వేలకు అమ్ముతున్నారు అంటూ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆక్సిజన్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ నింపి ఇస్తున్న మనోజ్ గుప్తా నిజంగా ప్రాణదాతే.