UP CM Yogi Adityanath..Atiq Ahmad
CM Yogi Adityanath : యూపీలో గ్యాంగ్ స్టర్ల(up gangster)పై ఉక్కుపాదం మోపిన సీఎం యోగీ ఆదిత్యానాథ్ (CM Yogi Adityanath )చేతుల మీదుగా మరో గొప్ప కార్యక్రమం జరిగింది. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ( Atiq Ahmad)ను చంపిన విషయం తెలిసిందే. కిడ్నాపులు, హత్యలు, బెదిరింపులు వంటి అతీక్ చేసే ఘోరాల్లో భూ కబ్జాలు ఎన్నో.100కుపైగా కేసుల్లో అతీక్ నిందితుడు.పోలీసుల సమక్షంలోనే హత్యకు గురికావడం సంచలనం రేపింది యూపీలో. అటువంటి అతీక్ కబ్జా చేసిన భూములను యోగీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అలా నిర్మించిన ఇళ్లను పేదలను పంపిణీ చేశారు సీఎం యోగీ ఆదిత్యానాథ్. 76మందిక లబ్దిదారులను ఇంటి తాళాలు అందించారు.
ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ( Atiq Ahmad) కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్న యోగి ప్రభుత్వం..ఆభూమిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana)కింద ఇళ్లను నిర్మించి పేదలకు పంచిపెట్టింది. పీఎంఏవై కింద 76 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి..ఆ ఇళ్లకు సంబంధించిన తాళం చెవులను లబ్ధిదారులకు అందించారు.
Atiq Ahmed Story: అతిక్ అహ్మద్ హత్య.. కుప్పకూలిన నేర సామ్రాజ్యం
లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించిన సందర్భంగా సీఎం యోగీ మాట్లాడుతు..2017కి ముందు పేదలు, వ్యాపారులు ప్రభుత్వ భూములను మాఫియా ఆక్రమించేది. కానీ ఇప్పుడలా కాదు.. కబ్జా చేసిన భూముల్లో పేదలను సంతోషంగా నివసించబోతున్నారు. పేదల సొంతింటి కల సాకారమవుతోంది. మాఫియా నుంచి విముక్తి పొందిన భూమిలో హౌసింగ్ యూనిట్లు నిర్మితమై పేదలకు ఆవాసంగా మారిందన్నారు. మాఫియ నుంచి విముక్తి పొందిన భూమిలో ఇప్పుడు నిర్మించిన గృహాలు ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది అన్నారు.
కాగా గ్యాంగ్ స్టర్లపై ఉక్కుపాదం మోపిని యోగీ సర్కారు గ్యాంగ్ స్టర్ అతీక్ ప్రయాగ్ రాజ్ లోని లుకర్ గంజ్ లో కబ్జా చేసిన భూముల్ని స్వాధీనం చేసుకుంది. అతీక్ అహ్మద్ బ్రతికున్నప్పుడే జప్తు చేసిన 1,731 చదరపు మీటర్ల స్థలంలో గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది. దాంట్లో 2021 డిసెంబర్ 26న సీఎం యోగి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును పీఎంఏవై కింద జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (DUDA)చేపట్టింది. రెండు బ్లాకులలో 76 ప్లాట్లను నిర్మించారు. 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు బెడ్ రూములు, వంటగది, టాయిలెట్ సౌకర్యాలతో ఫ్లాట్ ను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ రూ.3.5 లక్షకే ప్రభుత్వం అందించింది.
కాగా జప్తు చేసిన భూమిలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన నిరుపేదలకు జూన్ 9న 76 ప్లాట్‌లను కేటాయించింది ప్రభుత్వం. అలహాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆడిటోరియంలో కేటాయింపుల కోసం లాటరీ తీశారు. మొత్తం 6,030 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ ద్వారా ఎంపిక చేసి లబ్దిదారులకు అందించారు. సొంతింటి కల సాకారం అయిన ఓ లబ్దిదారుడు ఆనందం వ్యక్తం చేస్తు.. తనకు చాలా ఆనందంగా ఉందని, తనకు సొంత ఇల్లు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని..ఇప్పుడు ఇక తనను ఇక్కడి నుండి వెళ్లగొట్టలేరంటూ సంబరపడిపోయారు.