UP : యమునా నదిలో నలుగురు బాలికలు గల్లంతు..గజ ఈతగాళ్లతో గాలింపు

ఉత్తరప్రదేశ్‌లోని ఔరారియా జిల్లాలో ఫరిహ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకంది. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బాలికలు గల్లంతయ్యారు. యమునానది ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు. స్నానానికి ఐదుగురు బాలికలు వెళ్లగా నలుగురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా ఒక్క బాలిక సురక్షితంగా బైటపడి పెద్దల సహాయంతో పోలీసులను ఆశ్రయించగా గజఈతగాళ్లతో బాలికల కోసం గాలింపు చేపట్టారు.

Four Girls Drown While Bathing In Yamuna River

Four Girls Drown While Bathing in Yamuna river : ఉత్తరప్రదేశ్‌లోని ఔరారియా జిల్లాలో ఫరిహ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకంది. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బాలికలు గల్లంతయ్యారు. యమునానది ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు. స్నానానికి ఐదుగురు బాలికలు వెళ్లగా నలుగురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా ఒక్క బాలిక సురక్షితంగా బైటపడి పెద్దల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వెంటనే గజఈతగాళ్లను రంగంలోకి దింపారు. గల్లంతు అయిన బాలికల కోసం గజఈతగాళ్లు గాలింపు ముమ్మరం చేశారు.

అయనా పోలీసు సర్కిల్ పరిధిలోని ఫరిహ గ్రామంలో గల్లంతైన వారిలో ఇద్దరు బాలిక మృతదేహాలు లభించగా..మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం యమునలో గాలింపు ముమ్మరం చేశారు. కాగా మొత్తం ఐదుగురు బాలికలు కలిసి యమునానదిలో స్నానానికి వెళ్లగా ప్రవాహ వేగానికి నలుగురు కొట్టుకుపోయారు. ప్రియాంక అనే బాలిక సురక్షితంగా బయటపడి విషయాన్ని గామస్తులకు తెలిపింది.

పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను గుర్తించి వెలికితీయించారు. మిగిలిన ఇద్దరు బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని..పోలీసులువ వెల్లడించారు. యమునా నది ప్రవాహం ఉదృతిగా ఉంటంతో గాలింపు కష్టంగా ఉందని.. నదీ దిగువ ప్రాంత పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని అజిత్‌మల్‌ సీఐ ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.