Help Desks for Cows : యూపీలో ఆవుల సంరక్షణకు హెల్ప్ డెస్క్‌లు.. యోగి ప్రభుత్వంపై ట్విట్టర్ రియాక్షన్స్..

దేశంలో కరోనావైరస్ విజృభిస్తున్న పరిస్థితుల్లో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం చొరవ తీసుకుంది. ఆవుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

UP Help Desks for Cows  : దేశంలో కరోనావైరస్ విజృభిస్తున్న పరిస్థితుల్లో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం చొరవ తీసుకుంది. ఆవుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.



COVID19 ఆంక్షలను పాటించాలని ప్రతి ఆవు ఆశ్రయానికి (గౌషాలా) సూచనలు చేసింది. మాస్క్‌ల వాడకం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో 5,268కి పైగా ఆవు రక్షణ కేంద్రాలు ఉండగా 5,73,417 ఆవులను సంరక్షిస్తున్నారు.

COVID19 నిబంధనలను పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. అలాగే గోశాలలో ఆక్సిమీటర్లు సైతం అమర్చాలని సూచించింది. యూపీ సీఎం నిర్ణయంపై సోషల్ మీడియా నెగటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.



కరోనాతో వేలాది మంది యూపీ ప్రజలు పోరాడుతున్నారని, సరైన వనరులు లేక ప్రజలు చాలామంది కరోనాతో చనిపోతున్నారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది చనిపోతుంటే ఆవుల కోసం సీఎం ఉత్సహం చూపించడం పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు.




ట్రెండింగ్ వార్తలు