Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాల సరసన చేరింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

UP govt's Diwali gift for its employees and pensioners, hikes DA by 4%
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఉద్యోగులకు 4 శాతం నుంచి 38 వరకు డీఏ (కరువు భత్యం) పెంచనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. దీపావళి వస్తున్న నేపథ్యంలో పండగ బొనాంజాగా ఉద్యోగులకు ఈ పెంపును అందించనుంది యోగి ప్రభుత్వం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.
‘‘ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ పొందే వారికి డీఏ, డీఆర్‌ను 38 శాతం వరకు పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూలై 1, 2022 నుంచి పరిగణలోకి వస్తుంది. అంతే కాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులకు 6,908 రూపాయల బోనస్ కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది’’ అని ట్వీట్ చేశారు. చివరలో ‘అందరికీ అభినందనలు’’ అని రాసుకొచ్చారు.
కాగా, తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాల సరసన చేరింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
Pawan Kalyan: నన్ను ప్యాకేజి స్టార్ అనే సన్నాసి కొడుకులు ఎవరు.. వారిని చెప్పు తీసుకొని కొడతా