హత్రాస్ అత్యాచార నిందితులు చాలా మంచివాళ్లు…వారిని రక్షించాలంటూ ధర్నాలు

  • Published By: nagamani ,Published On : October 3, 2020 / 10:29 AM IST
హత్రాస్ అత్యాచార నిందితులు చాలా మంచివాళ్లు…వారిని రక్షించాలంటూ ధర్నాలు

Updated On : October 3, 2020 / 10:39 AM IST

hathras case.. : justice upper caste protest Demand upper caste protest : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఉత్తప్రదేశ్ హత్రాస్ యువతి అత్యాచార ఘటనలో నిందితులు చాలా మంచివాళ్లను అనవసరంగా వారిపై అత్యాచారం చేసారనే నిందలు వేసి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ హత్రాస్ లోనే మృతురాలి గ్రామం అయిన భాగ్నాలో అగ్రవర్ణాలు నిందితులకు న్యాయం చేయాలని ధర్నాకు చేపట్టాయి. అంతేకాదు సదరు నిందితులను ఉద్దేశపూర్వకంగా అత్యాచారం కేసులో ఇరికించారని..‘సిట్’ను ఏర్పాటు చేసినా నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని అగ్రవర్ణాల ప్రజలు డిమాండ్ చేశారు.


హత్రాస్ మృతురాలి కేసులో నిందితులను రక్షించటానికి అధికారులు యత్నాలు చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చేందుకు వెళ్లేవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆఖరికి బాధితురాలి తరపున వాదించటానికి సిద్ధమైన ఢిల్లీ ప్రముఖ మహిళా న్యాయవాది సీమా కుష్వాహాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ ఘోరానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితులను కాపాడటానికి అధికారులు ఎంతగా యత్నాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈక్రమంలో మృతురాలి స్వగ్రామం భాగ్నాలో అగ్రవర్ణాలు నిందితులకు న్యాయం చేయాలని ధర్నాకు దిగాయి. నిందితులకు అనుకూలంగా పంచాయతీ కూడా చేశారు. అత్యాచారం చేశారని అనవసరంగా వారిపై నిందలు వేసి బాధిస్తున్నారనీ..వారిని ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని, ‘సిట్’ను ఏర్పాటు చేసిన నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.


కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధికోసం ఈ ఘటనను రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నయని అగ్రవర్ణాలవారు విమర్శించారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురూ కేవలం నిందలు పడినవారే తప్ప అత్యాచారం చేసివాళ్లు కాదని వాళ్లు చాలా మంచివాళ్లని..వారిని నిర్ధోషులుగా భావించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


మరోపక్క… దళితులు కూడా తమ కుటుంబాలకు…తమ ఇంటి ఆడబిడ్డలకు భద్రతలేకుండాపోతోందనీ ఈ దాష్టీకాలు ఇంకా ఎన్నాళ్లు భరించాలి? దళితులుగా పుట్టటమే మా పాపమా? అంటూ యూపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా భారీ ధర్నా జరిగింది. హత్రాస్ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ చేస్తున్నారు.


యూపీలోని హత్రాస్‌ జిల్లాలో 19 ఏళ్ల దళిత బాలిక మనీషా వాల్మీకినీ నలుగురు యువకులు చంపినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమ బిడ్డను వారు అత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయం వల్లే ఆమె చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. మనీషాకు ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకునే అర్ధరాత్రి అంత్యక్రియలు చేశామని పోలీసులు, అనుమతి తీసుకేలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకోడానికీ మీడియా ప్రతినిధులు గ్రామానికి వెళ్తున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.
हाथरस में पीड़िता के गाँव से करीब एक किलोमीटर दूर यह भीड़ आरोपियों में समर्थन में इकठ्ठा हुई है। इनका कहना है कि आरोपियों को गलत फंसाया जा रहा है और स्वर्ण बनाम दलित राजनीति का खेल खेला जा रहा है। कठुआ में भी ऐसा ही हुआ था, अब वैसा ही हाथयस मामले मे हो रहा है