Eidgah Imam : మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు : ఈద్గా ఇమామ్

మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు అంటూ ముస్లింలకు ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు.

Mosques and Fridays are for prayers not for protests : శుక్రవారం వచ్చింది అంటూ అన్ని మసీదులు ముస్లిం సోదరుల ప్రార్థనలతో మారుమ్రోగుతుంటాయి. ముస్లింలు తప్పకుండా శుక్రరం మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో మసీదుల్లో ప్రార్థనలే కాదు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ విషయంపై యూపీలోని ఐషాబాద్ ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు. ‘మసీదులు ఉన్నవి శుక్రవారాలు ప్రార్థనలు చేసుకోవటానికి తప్ప నిరసన ప్రదర్శనలకు కాదు’ అంటూ సూచించారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఐషాబాద్ ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ బక్రీదు పండుగ సందర్భంగా..ముస్లింల్లో చైతన్యం దిశగా కీలక సూచన చేశారు. మసీదులు, శుక్రవారాలు ప్రార్థనల కోసమే కానీ, నిరసన ప్రదర్శనలకు కాదన్నారు. అంతేకాదు ముస్లిం సోదరులు పర్యావరణానికి పరిరక్షించటానికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

బక్రీద్ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. పండుగల సందర్భంగా త్యాగమనే ఆచారం 40 కోట్ల మంది పేదలకు అన్నం పెడుతుందని అన్నారు. ముస్లింలు అందరూ మొక్కలను నాటాలని..పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ముస్లింకి ఆచారంగా మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ పలు సూచనలు చేశారు.

మసీదులు అనేవి ప్రార్థనా స్థలాలని, వాటికి సమీపంలో ప్రదర్శనలు చేయకూడదని రషీద్ వెల్లడించారు. బక్రీద్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమని, రూ.1,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పారు. 20 లక్షల మంది రైతులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. వీరి రూపంలో 40 కోట్ల మందికి ఆహార అవసరాలు తీరతాయని ఈ సందర్భంగా రషీద్ తెలిపారు. ఆకలి చావులు, గ్లోబల్ వార్మింగ్, విద్యావంతుల ఆవశ్యకత పట్ల తన శ్రద్ధను చూపుతూ, మానవాళి సంక్షేమం కోసం కృషి చేయాలని మహాలి ప్రజలకు రషీద్ విజ్ఞప్తి చేశారు.

మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ముస్లిం పవిత్ర కర్తవ్యమని ప్రవక్త చెప్పారని తెలిపారు. జకాత్‌ను న్యాయబద్ధంగా పంపిణీ చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన.. ముస్లింలకు ఇది తప్పనిసరి ధార్మిక సంస్థ అని, పేదరికం, ఆకలి మరియు నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు