UP mother Fire By Son : చనిపోయాక తలకొరివి పెట్టాల్సి కొడుకు ఓ తల్లికి బతికుండగానే నిప్పుపెట్టాడు. భార్య..అత్తమామల సహకారంతో కన్నతల్లికే నిప్పు పెట్టాడో కసాయి కొడుకు. మంటల్లో కాలిపోయిన ఆ తల్లి చావు బతుకులతో పోరాడుతున్న ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. రోజు రోజుకూ యూపీలో అత్యాచారాలు..అఘాయిత్యాలు..హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఎస్పీ అపర్ణ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని శాజహాన్ పూర్ పరిధిలోని జలాలాబాద్ లో రత్నాదేవి అనే 58ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమె ఆకాష్ గుప్తా అనే కొడుకు..కోడలు దీప్ శిఖా ఉన్నారు. ఆ కొడుకు తల్లినుంచి వేరుగా వెళ్లిపోయి భార్యతో కలిసి అదే ప్రాంతంలో వేరుకాపురం పెట్టాడు. అత్తనుంచి కొడుకును దూరంగా వేరుగా వెళ్లినాగానీ కోడలు అత్తపై కక్ష సాధించటం మానలేదు.
https://10tv.in/son-suicide-as-mother-scolds-no-to-play-games-in-east-godavari-district/
తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారిని తరచూ వేధిస్తుండేది. మాటలతో చేతలతో మానసికంగా వేధింపులకు గురిచేసేది. అది తెలిసినాగానీ కొడుకు భార్యను గానీ..అత్తగారి కుటుంబాన్ని గాని ఒక్కమాటకూడా అనేవాడు కాదు. దీంతో మరింతగా రెచ్చిపోయి కోడలి కుటుంబం ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఆమె కుమారుడు తన భార్య, అత్తమామలతో కలిసి తల్లికి నిప్పంటించాడు. ఆ తల్లి మంటలు తట్టుకోలేక కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు మంటలు ఆర్పి..చికిత్స కోసం స్థానిక మెడికల్ కాలేజీకి తరలించారు.
అనంతరం పోలీసులకు సమచారం అందించారు. కానీ అప్పటికే చాలా వరకూ కాలిపోవటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.బాధితురాలి కుమారుడు కిషన్ గుప్తాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.