యూపీలో ‘ఆపరేషన్ దురాచారి’ :పబ్లిక్ ప్లేస్ గోడలపై పోకిరీల ఫోటోలు

  • Publish Date - September 25, 2020 / 01:15 PM IST

యూపీలో మహిళలు..యువతులనే కాదు చిన్నారులపై కూడా అఘాయిత్యాలు..అత్యాచారాలు పెరిగిపోతూ నేరాల రాష్ట్రంగా తయారైంది. ఆకతాయిల వేధింపులతో యువతులు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో పోకిరీల ఆటకట్టించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఆపరేషన్ దురాచారి’ల ఆటకట్టించేందుకు CM యోగీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది.


మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఆపరేషన్ దురాచారి’ పేరుతో వారికి చెక్ పెట్టడానికి సిద్ధం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోకిరీ చర్యలను ఊపేక్షించకూడదని పోలీసులను గట్టి ఆదేశాలు జారీ చేశారు. మహిళలతో చెడుగా ప్రవర్తించే వారి పరువు తీసేలా వారికి బుద్ది చెప్పాలని అవసరమైన కేసులు బుక్ చేయాలని ఆదేశించారు.


దీని ద్వారా మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వాళ్ల ఫోటోలను బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లుగా అతికించనున్నారు. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలో భయం, సిగ్గు మొదలవుతాయని మరోసారి మహిళలకు వేధించాలంటే భయపడతారని భావించారు.


మహిళలు..యువతుల కోసం యాంటి రోమియో స్క్వాడ్‌లతో భద్రత ఏర్పాటు చేశారు. ‘ఆపరేషన్ శక్తి’ పేరుతోనూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినా కూడా రాష్ట్రంలో అత్యాచారాలు, వేధింపులు ఆగడం లేదు. బాలికలు..యువతులపై దాడులు పెరిగిపోయాయి. అత్యాచారాలు..హత్యలు పెరిగిపోతున్నాయి. దీంతో మరింత కఠినంగా ఉండాలని సీఎం పోలీసులను ఆదేశించారు.