Lakhimpur Kheri : ల‌క్నో విమానాశ్రయంలో బైఠాయించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

లఖింపూర్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ ను లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

Lakhimpur Kheri : ల‌క్నో విమానాశ్రయంలో బైఠాయించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

Lakhimpur Kheri

Updated On : October 5, 2021 / 3:44 PM IST

Lakhimpur Kheri : ఉత్తరప్రదేశ్ లోని ల‌ఖింపూర్‌లో జరిగిన అల్లర్లలో న‌లుగురు రైతులు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దుర్ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు యూపీ పర్యటనకు వెళ్లారు. వారిలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ కూడా ఉన్నారు. ఇక లఖింపూర్ బయలుదేరిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించగా, మరికొందరిని చెదరగొట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే లఖింపూర్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ ను లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు.

Read More : Lakhimpur Kheri : కొత్త జమ్మూ కశ్మీర్ గా “ఉత్తరప్రదేశ్”.. 9 మరణాలకు ముందు అసలేం జరిగిందంటే

భూపేష్ భగల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన విమానాశ్రయంలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా పర్యటించి నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, తనను అనుమతించాలని యూపీ పోలీసులను కోరారు సీఎం. అయితే ఘటన జరిగిన లఖింపూర్ ఖేరి ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుందని, ఈ సమయంలో పర్యటన మంచిది కాదని పోలీసులు హితవు పలికారు. 144 సెక్టన్ కారణంగా తాము పంపలేమని సీఎం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ కు తేల్చి చెప్పారు.

Read More : Lakhimpur Kheri..మరణించిన రైతు కుటుంబాలకు రూ. 45లక్షల పరిహారం,ప్రభుత్వ ఉద్యోగం

మరోవైపు ఆ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టిన ప్రియాంకా గాంధీని సీతాపూర్ గెస్ట్‌హౌజ్‌లో నిర్బంధించారు. అయితే ప్రియాంకాను క‌లిసేందుకు వెళ్తున్న‌ట్లు సీఎం భూపేశ్ తెలిపారు. కానీ ల‌క్నో పోలీసులు మాత్రం ఆయ‌న‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. దీంతో కాసేపు విమానాశ్రయంలో బైఠాయించిన ఆయన తిరిగి పయనమయ్యారు. పోలీసుల‌తో సంభాషించే వీడియోను కూడా భూపేశ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.