BJP MLA Raja Singh:‘బీజేపీకి ఓట్లు వేయనివారి ఇళ్లపైకి బుల్ డోజర్లు’వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్‌కు EC నోటీసులు

బీజేపీకి ఓట్లు వేయనివారి ఇళ్లపైకి బుల్ డోజర్లు పంపిస్తాం అని హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై EC సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

EC Notice to BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో..హిందువులంతా ఏకం కావాలి. యోగీ ఆదిత్యానాథ్ కు ఓట్లు వేయాలని.. బీజేపీకి ఓట్లు వేయని వారిని గుర్తించి వారి ఇళ్లపైకి బుల్ డోజర్లు పంపిస్తామని..ఇప్పటికే సీఎం యోగీ బుల్ డోజర్లు,జేసీబీలను తెప్పిస్తున్నారని హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.

Also read : MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

యూపీ రాష్ట్ర ఓటర్లను రాజాసింగ్ బెదిరించారని..ఓటర్లపై రాజాసింగ్‌ బెదిరింపులకు పాల్పడినందుకు రాజా సింగ్ కు ఈసీ నోటీసులు పంపింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసుల్లో ఈసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని ఎన్నికల సంఘం పేర్కొంది.

Also read : Minister KTR : ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కేటీఆర్

యూపీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్..త్వరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఒక్కటవ్వాలని..యోగీకే ఓట్లు వేయాలని ఎలక్షన్ అనంతరం యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. బీజేపీకు ఓటువేయని వారి ఇళ్లకు బుల్డోజర్లను పంపిస్తాం..యోగి జీ వద్ద వేల బుల్డోజర్లు ఉన్నాయి…వాటిని యోగీకి ఓటు వేయనివారి ఇళ్లపైకి పంపిస్తాం అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో రెండోదశ పోలింగ్ సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మిగిలిన దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు