MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని..బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

Mla Raja Singh

do not vote for cm yogi adityanath will be expelled MLA Raja singh : యూపీ ఎన్నికల్లో హిందువులందరూ..ఏకం కావాలని..హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని..పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎన్నికల్లో యోగీకి ఓటు వేయనివారంతా ద్రోహులు అని..వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని స్పష్టం చేశారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యానాథ్ కు ఓట్లు వేయనివారిని గుర్తిస్తామని రాజాసింగ్ తెలిపారు.

ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని చెప్పారు. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? అని ప్రశ్నించిన రాజాసింగ్..యోగీ ఆదిత్యానాథ్ కు ఓటు వేయని వారిని గుర్తించి..యోగీకి (అంటే బీజేపీకి) ఓట్లు వేయనివారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలు పంపిస్తామనీ..యోగీకి ఓట్లు వేయనివారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు, జేసీబీలు పంపిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

Also read : Hijab Row : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే
కాగా..దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడి కొనసాగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో రెండోదశతో పాటు గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ సోమవారం (ఫిబ్రవరి 14,2022) ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌‌లో మిగిలిన దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. పంజాబ్, మణిపూర్‌లల్లోనూ పోలింగ్ ముగుస్తుంది. 20వ తేదీన ఉత్తర ప్రదేశ్ మూడోదశతో పాటు పంజాబ్‌‌లో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

కాగా..బీజేపీ ఆందోళనలో పడినట్లుగా సమాచారం. కారణం..బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో..బీజేపీ విజయంపై ఆందోళన నెలకొంది.ఇటువంటి పరిస్థితుల మధ్య బీజేపీకే చెందిన తెలంగాణ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో తొలి రెండుదశల్లో నమోదైన పోలింగ్ ట్రెండ్.. నిరాశకు గురి చేసిందనే అభిప్రాయం రాజాసింగ్ చేసిన వివాదాస్ప వ్యాఖ్యానాల్లో స్పష్టమువోతంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటర్లు ఉన్నారని..అందుకే రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు. ఉత్తర ప్రదేశ్‌లో నివసించాలంటే బీజేపీకి ఓటు వేయక తప్పదంటూ టీ రాజాసింగ్ హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకుంటారా?అనే విమర్శలు వస్తున్నాయి.

Also read : Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

యోగి అంటే వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో భారీ పోలింగ్ నమోదు అయినట్లుగా తెలుస్తోంది. దీంతతో యోగిని సీఎంగా అంగీకరించని వారు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి..తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి హిందు బంధువులందరూ ఏకం కావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారని..మిగిలిన అయిదు దశల్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మూడోదశ కోసం పోటెత్తాలి.. మూడోదశ పోలింగ్ సందర్భంగా హిందువులందరూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయని వారిని గుర్తిస్తామని, వారిని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. అందుకే అటువంటివారిని గుర్తిస్తామని…ఇప్పటికే యోగీ బుల్‌డోజర్లు, జేసీబీలను యోగి తెప్పిస్తున్నారని..అవి బయలుదేరాయని కూడా రాజాసింగ్ వ్యాఖ్యానించారు.బీజేపీ నేతల్లో ఈ అసహనానికి కారణం- తొలి రెండు దశల్లో పోలింగ్ ట్రెండ్.. బీజేపీకి వ్యతిరేకంగా ఉందనే సంకేతాలను పంపించినట్టయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ అసంతృప్తితోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.