Minister KTR : ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కేటీఆర్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

Minister KTR : ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కేటీఆర్

Ktr (3)

Minister KTR condemned : యూపీలో బీజేపీకి, యోగికి ఓటు వేయనివారిని గుర్తించి, వాళ్ల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీలో మరో అద్భుతమైన కమెడియన్ పుట్టుకొచ్చాడంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను కమెడియన్ తో పోల్చారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని గుర్తించి వారి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసిందని.. మూడో విడత పోలింగ్‌లో కచ్చితంగా హిందువులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.  యూపీ ఎన్నికల్లో హిందువులందరూ..ఏకం కావాలని..హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటువేయాల్సిందేనని..పిలుపునిచ్చారు. ఎన్నికల్లో యోగీకి ఓటు వేయనివారంతా ద్రోహులు అని..వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యానాథ్ కు ఓట్లు వేయని వారిని గుర్తిస్తామని రాజాసింగ్ అన్నారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.

MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని చెప్పారు. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? అని ప్రశ్నించిన రాజాసింగ్..యోగీ ఆదిత్యానాథ్ కు ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలు పంపిస్తామనీ రాజాసింగ్ హెచ్చరించారు. నిన్న రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

మరోవైపు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో విజయంపై ఆ పార్టీ నేతలు ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకే చెందిన తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో తొలి రెండుదశల్లో నమోదైన పోలింగ్ ట్రెండ్.. నిరాశకు గురి చేసిందనే అభిప్రాయం రాజాసింగ్ చేసిన వివాదాస్ప వ్యాఖ్యానాల్లో స్పష్టమవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటర్లు ఉన్నారని..అందుకే రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు. ఉత్తర ప్రదేశ్‌లో నివసించాలంటే బీజేపీకి ఓటు వేయక తప్పదంటూ రాజాసింగ్ హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకుంటారా?అనే విమర్శలు వస్తున్నాయి.

UP Election 2022: యూపీలో పోలింగ్ శాతం ఏం చెబుతోంది.. అధికార మార్పు జరుగుతుందా?

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడి కొనసాగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో రెండోదశతో పాటు గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ నిన్న ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఉత్తర్ ప్రదేశ్‌‌లో మిగిలిన దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. పంజాబ్, మణిపూర్‌లల్లోనూ పోలింగ్ ముగుస్తుంది. 20వ తేదీన ఉత్తర ప్రదేశ్ మూడోదశతో పాటు పంజాబ్‌‌లో పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది.