UP + Yogi = Upyogi : యూపీ + యోగి= ‘ఉపయోగి’ అంటూ చమత్కారం.. విపక్షాలను ఏకిపారేసిన మోడీ

యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి రాష్ట్రానికి మోడీ భారీ కానుకనే ప్రకటించారు. ఒకవైపు యోగిపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు.

Up + Yogi = Upyogi Pm Modi Lashes Out At Opponents Ahead Of Polls

UP + Yogi = Upyogi : ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. మరోవైపు విపక్షాలపై అధికార పార్టీ  కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. మరో నెలలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ భారీ కానుకనే ప్రకటించారు. యూపీలోని షాజహాన్ పూర్‌లో అత్యంత పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు మోడీ శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.50 గంటలకు రోజా రైల్వే గ్రౌండ్‌కు చేరుకుని మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తనదైనశైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కానీ, యూపీ సీఎం యోగిని మాత్రం మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ రోజుల్లో మాఫియాలు బుల్ డోజర్ ఎదుర్కొటే.. బుల్ డోజర్ అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తోందన్నారు. అందుకే ప్రజలు అంటున్నారు.. యుపి+యోగి.. బహుత్ హై ఉపయోగి (UP+Yogi = UPYogi) అంటూ యోగిపై ప్రధాని మోడీ చమత్కరించారు.

ఈ సందర్భంగా మోడీ తన ప్రసంగంలో విపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధించారు. మాజీ ముఖ్యమంత్రులపై ఎదురుదాడికి దిగారు. గతంలో ప్రజల సొమ్మును ఏ పద్ధతిలో వినియోగించారో ప్రజలు చూశారు.. కానీ నేడు యూపీలోని నిధులను అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారని కొనియాడారు. ఇంతకు ముందు ఈ ప్రాజెక్టులు కాగితాలపై మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ఖజానా, ఈ ప్రాజెక్టులతో మీ డబ్బు ఆదా అయ్యేలా ఎప్పుడూ మీ జేబులో ఉండేలా చేస్తున్నాయని మోడీ అన్నారు. రాజకీయ వారసత్వంపై కూడా మోడీ ప్రస్తావించారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ రాజకీయ వారసత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. వారికి ఓటు బ్యాంకు ఉండటం వల్లే వారసత్వంతో సమస్య వచ్చిందన్నారు. వీరంతా భారత సైన్యం చర్యలు, మేక్-ఇన్-ఇండియా స్కీమ్, మహమ్మారి నిర్వహణపై విమర్శలు చేస్తున్నారు.

భారత్ గొప్ప దేశం.. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. దేశ పురోగతితో మనం సంతోషంగా ఉండాలి. కానీ, ఏ వ్యక్తులు ఇలా ఆలోచించరని మోడీ చెప్పారు. ప్రారంభమైన 6 లేన్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌ను భవిష్యత్తులో 8 లేన్‌లకు విస్తరించే అవకాశం ఉందన్నారు. వచ్చే తరానికి మౌలిక సదుపాయాలతో యుపి అత్యంత ఆధునిక రాష్ట్రంగా గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్, నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయాలు, కొత్త రైలు మార్గాలు ఒకేసారి యూపీ ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను తీసుకువస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ప్రధాని అయిన తర్వాత మోడీ రెండోసారి షాజహాన్‌పూర్‌లో పర్యటిస్తున్నారు. 2018లో రైతుల సంక్షేమ ర్యాలీలో ప్రసంగించేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే మరోసారి గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేసేందుకు మోడీ వచ్చారు. ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 36,230 కోట్లు. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) కింద నిర్మించనున్నారు. మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మించే 594 కి.మీ పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2024 సంవత్సరంలో పూర్తవుతుంది. మీరట్‌లోని బిజౌలీ గ్రామం నుండి ప్రారంభించి, ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామానికి చేరుకునే వరకు, 12 జిల్లాలోని 30 ప్రాంతాలను కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సాగుతుంది.

ఏదొచ్చినా.. సమాజ్ వాదీ ‘సైకిల్’ ఆగదు : అఖిలేశ్ యాదవ్ : 
మరోవైపు.. యాదవుల కోటగా పేరొందిన మెయిన్‌పురితో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అనుచరులు దాడి చేశారు. ఐటీ అధికారుల సోదాలు ప్రారంభమైన కొద్దిసేపటికే, కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని యాదవ్ ఆరోపించారు. ‘అభి తు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అయ్యా హై, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయేగా, సీబీఐ ఆయేగా (ప్రస్తుతం.. పన్ను శాఖ వచ్చింది.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వస్తుంది.. సీబీఐ కూడా వస్తుంది) కానీ, సైకిల్ (సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు)ను మాత్రం ఆపలేరంటూ అఖిలేశ్ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.

Read Also : CM KCR : యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనడంలేదు : సీఎం కేసీఆర్