CM KCR : యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనడంలేదు : సీఎం కేసీఆర్

యాసంగి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని చెప్పింది.

CM KCR : యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనడంలేదు : సీఎం కేసీఆర్

Kcr Grain

Yasangi grain purchases : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పేసింది. యాసంగిలో రైతుల నుంచి ఒక్కటంటే ఒక్క కిలో వడ్లను కొనేదిలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం.. యాసంగి వడ్లు కొనడం లేదని..అందుకే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. యాసంగి ధాన్యాన్ని కొనబోమనే విషయాన్ని రైతులు తెలియజెప్పాలని..వారికి అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వచ్చే యాసంగి విషయంలో ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఒక కిలో ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయబోమని సీఎం మరోసారి పునరుద్ఘాటించారు.

Pushpa : పుష్ప సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా భారీ కలెక్షన్స్..ఫస్ట్‌ డే రూ.70కోట్లు వసూల్

దీనికి సంబంధించి కేసీఆర్ మరోసారి ప్రకటన చేయడంతో కలెక్టర్లు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కలెక్టర్లు కూడా ప్రజల్లోకి వెళ్లి, క్షేత్రస్థాయిలో తిరిగి వచ్చే ఏడాదికి సంబంధించి ధాన్యం కొనబోమని తెలపాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరా విధానాలను అనుసరిస్తుందని సీఎం కేసీఆర్ విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో యాసంగిలో ఇక వరి పంట వెయ్యవద్దని సీఎం స్పష్టత ఇచ్చారు. దానికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు.

CM KCR : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

ఈ విషయంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని అధికారలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. ధాన్యం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారా రైతులను కాపాడుకున్న వారిమవుతామని సమావేశంలో కలెక్టర్లకు సూచించారు.