UPSC 2022: యూపీఎస్సీ ఆఫీసర్ కావాలంటుకున్నారా.. అయితే ఇది మీ కోసమే..

యూపీఎస్సీ ఈ సారి భారీగా పోస్టులను విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లికేషన్లను భర్తీ చేయాలని సూచించింది.

UPSC 2022: యూపీఎస్సీ ఆఫీసర్ కావాలంటుకున్నారా.. అయితే ఇది మీ కోసమే..

Upsc Jobs (1)

Updated On : January 23, 2022 / 8:43 AM IST

UPSC 2022: యూపీఎస్సీ ఈ సారి భారీగా పోస్టులను విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లికేషన్లను భర్తీ చేయాలని సూచించింది. UPSC అఫీషియల్ వెబ్ సైట్ లో upsc.gov.in ఆన్ లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. మొత్తం 14పోస్టులకు గానూ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

నోటిఫికేషన్ లోని వివరాలను బట్టి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టుల వివరాలివే.

సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ -8 పోస్టులు
అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ – 1పోస్ట్
సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ – 1పోస్ట్
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద) – 4పోస్టులు

ఇది కూడా చదవండి: కొత్త ఇంట్లో పూజా.. నా కల నెరవేరింది అంటూ..

నోటిఫికేషన్ ను బట్టి.. జనరల్ కేటగిరి క్యాండిడేట్స్ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎస్బీఐ బ్యాంకులో రూ.25డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. Visa / Master Credit / Debit card లతోనైనా ఫీజు చెల్లించుకోవచ్చు. మరోవైపు SC/ST/PWD/Women కేటగిరీలకు చెందిన ఏ కమ్యూనిటీ అభ్యర్థులైనా ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. సంబంధిత కమ్యూనిటీ సర్టిఫికేట్ సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.