సివిల్స్ ఫలితాలు విడుదల…కనిషక్ కతారియా టాపర్

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 02:56 PM IST
సివిల్స్ ఫలితాలు విడుదల…కనిషక్ కతారియా టాపర్

Updated On : April 5, 2019 / 2:56 PM IST

2018 సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలను శుక్రవారం(ఏప్రిల్-5,2019)UPSC(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)విడుదల చేసింది.ఈ ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలో IIT బొంబాయి గ్రాడ్యేయేట్  కనిషక్ కతారియా టాపర్ గా నిలిచాడు.759మందిలో కనిషక్ టాపర్ గా నిలిచాడు.అక్షిత్ జైన్ అనే యువకుడు సెకండ్ ర్యాంక్ సాధించాడు.శృతి జయంత్ దేశ్ ముఖ్ 5వ ర్యాంకుతో అమ్మాయిల్లో టాపర్ గా నిలిచింది.టాప్ 25లో 15మంది మగవాళ్లు ఉండగా,10మంది మహిళలు ఉన్నారు.

ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్,సెంట్రల్ సర్వీసెస్,గ్రూప్ ఏ,గ్రూప్ బి సర్వీసులకు 759 మంది అభ్యర్థులు నియమించబడనున్నారు.వీరిలో 577మంది మగవాళ్లు,182మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా వారిని ఆయా పోస్ట్ లలో వారిని నియమించడం జరుగుతుందని UPSC ఓ ప్రకటనలో తెలిపింది. 

2018 సెప్టెంబర్-అక్టోబర్ నెలల మధ్య సివిల్ సర్వీసెస్ రాతపూర్వక పరీక్షలను UPSC నిర్వహించింది.2019 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య పర్శనాలిటీ టెస్ట్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి.శుక్రవారం(ఏప్రిల్-5,2019) ఫలితాలు విడుదల అయ్యాయి.