UPSC Results: UPSC సివిల్స్ ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం మధ్యాహ్నం రిజల్ట్స్ ను యూపీఎస్సీ విడుదల చేసింది. 1,129 పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ ఇవ్వగా 1,009 మంది క్వాలిఫై అయ్యారు. 2024 జూన్ 16న ప్రిలిమ్స్, సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆల్ ఇండియాలో శక్తి దూబే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హర్షిత గోయల్ సెకండ్ ర్యాంక్. ఇక తెలుగు అభ్యర్థి సాయి శివాణి 11వ ర్యాంక్ తెచ్చుకున్నారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
శక్తి దూబే (1)
హర్షిత గోయల్ (2)
అర్చిత్ పరాగ్ (3)
షా మార్గి చిరాగ్ (4)
ఆకాశ్ గార్గ్ (5)
కోమల్ పునియా (6)
ఆయుషీ బన్సల్ (7)
రాజ్‌కృష్ణ ఝా (8)
ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9)
మయాంక్ త్రిపాఠి (10)
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది యూపీఎస్సీ. 1,009 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు. సివిల్ సర్వీసెస్ నిబంధనలను అనుసరించి 230 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచింది యూపీఎస్సీ.
Education Loan : హైయర్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలో తెలుసా?
2024 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 9,92,599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,83,213 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షకు మొత్తం 14,627 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 2,845 మంది అభ్యర్థులు ఈ సంవత్సరం జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 మధ్య జరిగిన ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 1,009 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరిలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు.
1,129 ఖాళీలను (IASలో 180, IFSలో 55, IPSలో 147, వివిధ కేంద్ర గ్రూప్ A సర్వీసులలో 605, గ్రూప్ B సర్వీసులలో 142) 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.
టాప్ 25 అభ్యర్థులలో 11 మంది మహిళలు ఉండగా, 14 మంది పురుషులు ఉన్నారు. వారి విద్యార్హతలు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), VIT, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), ఢిల్లీ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ సైన్స్, ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నాయని UPSC తెలిపింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here