Harpoon Missile Deal : భారత్ కి హార్పూన్ మిసైళ్ల అమ్మకానికి అమెరికా ఆమోదం

హ‌ర్పూన్ మిస్సైళ్లను(Harpoon Joint Common Test Set)మరియు సంబంధిత పరికరాలను భారత్ కు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

Harpoon Missile Deal : భారత్ కి హార్పూన్ మిసైళ్ల అమ్మకానికి అమెరికా ఆమోదం

Missile

Updated On : August 3, 2021 / 7:51 PM IST

Harpoon Missile Deal హ‌ర్పూన్ మిస్సైళ్లను(Harpoon Joint Common Test Set)మరియు సంబంధిత పరికరాలను భారత్ కు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. యాంటీ షిప్ హ‌ర్పూన్ మిస్సైళ్ల కోసం భారత్ సుమారు 82 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నుంది. ఈ నిర్ణయంతో క్షిప‌ణుల అమ్మ‌కాల‌తో రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క బంధం మ‌రింత బ‌లోపేతం కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. మిస్సైళ్ల అమ్మకాల గురించి పెంట‌గాన్ ఢిఫెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీ(DSCA)..అవసరమైన ఓ రిపోర్ట్‌ను సోమవారం యూఎస్ కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్)చేర‌వేసింది.

హార్పూన్ క్షిపణి ప్రపంచంలో అత్యంత విజయవంతమైన యాంటీ షిప్ మిసైల్. ఇది 30 కి పైగా దేశాల ఆర్మీ ఈ మిసైల్స్ ని కలిగిఉన్నాయి. వాతావ‌ర‌ణం ఏదైనా దానికి త‌గిన‌ట్లు హ‌ర్పూన్ క్షిప‌ణి ప‌నిచేస్తుంది. యాంటీ షిప్ మిస్సైల్ సిస్ట‌మ్‌ను తొలిసారి 1977లో అభివృద్ధి చేశారు.

ఒక హార్పూన్ ఇంటర్మీడియెట్ లెవల్ మెయిన్ టెన్సెన్ స్టేషన్,స్పేర్ అండ్ రిపేర్ పార్ట్స్,సపోర్ట్,టెస్ట్ ఎక్యూప్మెంట్ సహా ఒక హ‌ర్పూన్ జాయింట్ కామ‌న్ టెస్ట్ సెట్ (జేసీటీఎస్‌)ను కొనుగోలు చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం రిక్వెస్ట్ చేసింద‌ని అమెరికా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ డీల్ విలువ 82 మిలియన్ డాలర్లని తెలిపింది. ఈ డీల్.. అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని, ఇండో-పసిఫిక్ మరియు దక్షిణ ఆసియా ప్రాంతంలో ఆర్థిక పురోగతి,శాంతి,రాజకీయ స్థిరత్వం మరియు ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న ప్రధాన రక్షణ భాగస్వామి(భారత్) యొక్క భద్రతను మెరుగుపరచడం ద్వారా అమెరికా విదేశాంగ విధానం మరియు జాతీయ భద్రతకు మద్దతు ఇస్తుందని DSCA ప్రకటనలో పేర్కొంది