అర్థరాత్రి గుట్టుచప్పుడుగా : భారత్ పై కోబ్రాబాల్ నిఘా

 భారత్‌ పై అమెరికా నిఘాపెట్టనట్లు తెలుస్తోంది. యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు బుధవారం(మార్చి-27,2019)భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే.మిషన్ శక్తి పేరుతో కేవలం మూడు నిమిషాల్లోనే అంతరిక్షంలోని ఉపగ్రహాన్నివిజయవంగా భారత్ పేల్చివేసింది.దీంతో ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది.భారత్ ఆపరేషన్ పై ప్రపంచ దేశాలు దీనిపై పెద్దగా ఎటువంటి అభ్యంతారాలు వ్యక్తం చేయలేదు.ఒక్క పాకిస్థాన్‌ మాత్రమే అంతరిక్ష భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. 

అయితే భారత్ బుధవారం ఉదయం మిషన్ శక్తి ప్రకటన చేసిన తర్వాత రాత్రి 11.30 సమయంలో అమెరికాకు చెందిన ఆర్‌సీ-135ఎస్‌ కోబ్రా బాల్‌ అనే ప్రత్యేకమైన నిఘా విమానం బంగాళాఖాతంలోకి  వచ్చివెళ్లింది. సాధారణంగా ఏదైనా పేలుళ్లు, ప్రయోగాలు జరిగినప్పుడు లభించే బాలిస్టిక్‌ డేటాను ఆర్‌సీ-135ఎస్‌ సమీకరిస్తుంది. అమెరికా దగ్గర 55ఏళ్ల క్రితమే మూడు ఇలాంటి విమానాలు ఉన్నాయి. వీటిల్లో ఒకదానిని హిందూ మహాసముద్రంలోని డిగోగార్సియా సైనిక స్థావరంలో మోహరించింది. సాధారణంగా ఇరాన్‌, ఉత్తర కొరియాలు ఆయుధ పరీక్షిలు నిర్వహించినప్పుడు ఈ విమానం వెళ్లి వివరాలను సమీకరిస్తుంది. ఈ విమానం సేకరించిన సమాచారం మొత్తం నేరుగా అమెరికా NSA, అమెరికా ఢిఫెన్స్‌ సెక్రటరీకి చేరతాయి.ఈ విమానం పంపిన ఘటనపై అమెరికా అధికారంగా స్పందించలేదు.అయితే అమెరికా యంత్రాంగం మాత్రం సొంతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.