Indian Students : యూఎస్‌లో విద్య అభ్యసించేందుకు ఎగబడుతున్న భారతీయ విద్యార్థులు…వరుసగా మూడో ఏడాది రికార్డ్, ఓడీఆర్ రిపోర్ట్ వెల్లడి

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు అమెరికా అగ్రస్థానంలో నిలచింది. వరుసగా మూడో ఏడాది కూడా యూఎస్‌లో విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎగబడుతున్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది....

Indian Students

Indian Students : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు అమెరికా అగ్రస్థానంలో నిలచింది. వరుసగా మూడో ఏడాది కూడా యూఎస్‌లో విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎగబడుతున్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. భారతీయ విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ ప్రాధాన్యం ఇస్తుందని యూఎస్ ఎంబసీ నుంచి విడుదలైన నివేదిక తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో గణనీయంగా 35 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

ALSO READ : Polluted Cities : దేశంలో దీపావళి తర్వాత కాలుష్య నగరాలివే…

2022-23 విద్యా సంవత్సరంలో 268,923 మంది భారతీయ విద్యార్థులు చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. ఒక మిలియన్ అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం జనాభాలో 25 శాతానికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాను తమ ప్రాధాన్య గమ్యస్థానంగా భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్నారు.

ALSO READ : Rishi Sunak : యూకే ప్రధానమంత్రి రిషి సునక్ పై ఎంపీ అవిశ్వాస లేఖ

‘‘విదేశాలలో చదువుకోవాలనే నిర్ణయంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్‌ని మీరు ఎంపిక చేసుకొని మీరు మా దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారు’’ అని భారతదేశంలోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పారు.2009-10వ సంవత్సరం తర్వాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో అగ్రగామిగా ఎదుగుతున్న భారతదేశం చైనాను అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు