అంతా మోసం.. రూ.300 ఆభరణాన్ని యువతికి రూ.6 కోట్లకు అమ్మిన వ్యాపారి.. ఎలాగో తెలుసా?

US Woman: ఆభరణాల వ్యాపారి గౌరవ్ సోనిని కలిసి, గొడవ పెట్టుకుంది. అయితే, ఆమె చేస్తున్న..

US Woman

అమెరికా యువతిని మోసం చేసి, రూ.6 కోట్లు కొట్టేశాడు జైపూర్‌కు చెందిన ఓ నగల వ్యాపారి. రూ.300 వందల విలువజేసే నకిలీ ఆభరణాన్ని ఆమెకు రూ.6 కోట్లకు అంటగట్టాడు. జైపూర్ లో నగలు చాలా బాగుంటాయని చెరిష్ అనే అమెరికా యువతి ఇక్కడ ఆభరణాన్ని కొనాలనుకుంది.

రాజస్థాన్ లోని జైపూర్, జోహ్రీ బజార్ గోల్డ్ పాలిష్ చేసిన సిల్వర్ ఆభరాన్ని ఆమెకు వ్యాపారి చూపించాడు. ఆ ఆభరణాన్ని రూ.6 కోట్లకు కొనుక్కుని వెళ్లిన యువతి.. దాన్ని అమెరికాలో ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో ఉంచింది. దీంతో అక్కడ అది నకిలీదని తేలింది.

చివరకు అసలు విషయాన్ని తెలుసుకున్న చెరిష్ మళ్లీ జైపూర్ కు వచ్చి ఆభరణాల వ్యాపారి గౌరవ్ సోనిని కలిసి, గొడవ పెట్టుకుంది. అయితే, ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ గౌరవ్ సోని బుకాయించాడు. దీంతో ఆమె జైపూర్ లో ఫిర్యాదు దాఖలు చేసింది. అలాగే, అమెరికా రాయబార కార్యాలయ సాయం తీసుకుంది.

దీనిపై విచారణ జరపాలని జైపూర్ పోలీసులకు అమెరికా రాయబార అధికారులు కూడా చెప్పారు. 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనిని పరిచయం చేసుకున్నానని, రూ.6 కోట్లను దశవారీగా చెల్లించానని తెలిపింది. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో వ్యాపారి గౌరవ్ తో పాటు అతడి తండ్రి రాజేంద్ర సోని పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: చిగురిస్తున్న రైల్వేజోన్‌ ఆశలు.. విశాఖ రైల్వేజోన్‌పై కదలిక?

ట్రెండింగ్ వార్తలు